వీధుల్లో పిల్లలను, జనాన్ని భయపెట్టాలని చూసిన మహిళ.. చివరికి!!

ఓ మహిళ తన హాలోవీన్ మేకప్‌తో...;

Update: 2024-11-13 02:33 GMT
woman, HalloweenMakeup, Delhi, ViralVideo, woman tries to scare people with Halloween makeup in Delhi Viral video, Halloween makeup in Delhi Viral video

Halloween makeup

  • whatsapp icon

హాలోవీన్.. భారతదేశంలో ఈ మధ్యనే కాస్త ఫేమస్ అవుతూ ఉంది. చిత్ర విచిత్ర మేకప్, కాస్ట్యూమ్స్ ను వేసుకుని భయపెట్టడమే ఈ హాలోవీన్ థీమ్. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో వీటిని నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని ఈవెంట్స్ కు అలా రెడీ అయిపోయి వెళ్లే వాళ్లు కొందరైతే. రోడ్ల మీదకు కూడా వచ్చేసే వారు మరికొందరు. తాజాగా ఓ ఢిల్లీ మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన హాలోవీన్ మేకప్‌తో వీధుల్లో పిల్లలను, ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నించింది. పశ్చిమ్ విహార్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ షైఫాలీ నాగ్‌పాల్ తన హాలోవీన్ స్టంట్ వీడియోను పోస్ట్ చేసారు. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎర్రటి పెయింట్‌తో స్లీవ్‌లెస్ తెల్లని దుస్తులలో 'దెయ్యం' లాగా దుస్తులు ధరించి, వింతైన కాంటాక్ట్ లెన్స్‌లు ధరించి, నాగ్‌పాల్ స్థానిక పార్కుకు తీసుకువెళ్లింది. అక్కడ పిల్లలు ఆమె రూపాన్ని చూసి భయపడిపోయారు. ఆమె సమీపంలోని వీధిలో నడిచింది, పలువురు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. కొందరు ఆమెతో ఫోటోలు కూడా దిగారు. కొందరు ఆమె చేసిన పనిని ప్రోత్సహించినా.. మరికొందరేమో ఆమె చేసింది తప్పు అంటూ విమర్శలు గుప్పించారు. పాపం చిన్న పిల్లలు భయపడి జ్వరం వస్తే ఎవరిది బాధ్యత అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేయగా.. మరికొందరేమో ఇది భారతదేశం కల్చర్ కాదంటూ క్లాస్ పీకారు.



Tags:    

Similar News