Auto Driver: బ్యాగ్ లో విలువైన వస్తువు.. ఆ ఆటో డ్రైవర్ ఏమి చేశాడంటే?

బ్యాగ్ పోయిందని గుర్తించిన తర్వాత ఆమెలో

Update: 2024-09-09 16:33 GMT

గురుగ్రామ్ ఆటో డ్రైవర్ మంచితనానికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఓ మహిళ మధ్యాహ్నం 1 గంటలకు ఆటో ఎక్కింది. UPI ద్వారా ఛార్జీని చెల్లించిన తర్వాత అనుకోకుండా తన పర్సును ఆటోలో వదిలివేసింది. బ్యాగ్‌లో ఆమె ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు వంటి కీలకమైన పత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా విలువైన బహుమతి కూడా ఉంది. అదేమిటంటే ఆమె దివంగత అమ్మమ్మ, తల్లి ఆమెకు బహుమతిగా ఇచ్చిన డైమండ్ లాకెట్టుతో అలంకరించిన బంగారు గొలుసు.

బ్యాగ్ పోయిందని గుర్తించిన తర్వాత ఆమెలో టెన్షన్ మొదలైంది. UPI మెసెంజర్ ద్వారా డ్రైవర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించార., కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరింత సహాయం కోరుతూ గురుగ్రామ్ పోలీసులను ఆశ్రయించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అధికారులు ఆటో రిక్షా జాడ కోసం ప్రయత్నించారు. అయితే, ఒక గంట తర్వాత, బ్యాగ్ పోగొట్టుకున్న వారి ప్రాపర్టీ మేనేజర్ నుండి కాల్ వచ్చింది. బ్యాగ్‌తో మణిరుల్ జమాన్ అనే ఆటోడ్రైవర్ తిరిగి వచ్చినట్లు సమాచారం ఇచ్చాడు. బ్యాగ్‌లోని బంగారు గొలుసుతో సహా ప్రతి ఒక్క వస్తువు కూడా ఉందని తెలిసి ఆనందం వ్యక్తం చేశారు. మనుషుల్లో మానవత్వం ఇంకా ఉందని ఆ ఆటోడ్రైవర్ నిదర్శనం అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.

https://www.linkedin.com/posts/arnav-deshmukh_bengaluru-cybercity-appreciation-activity-7238086374682226688-fQWA/?utm_source=share&utm_medium=member_android

Tags:    

Similar News