Viral VIDEO: బైక్‌తో రైలు ఇంజిన్‌ను లాగేందుకు ప్రయత్నించిన యువకుడు.. పోలీసులు ఏమి చేశారంటే?

సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చేసి సెలెబ్రిటీలు అవ్వాలని కొందరు

Update: 2024-09-13 04:16 GMT

సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు చేసి సెలెబ్రిటీలు అవ్వాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు వారిని చిక్కుల్లోకి నెడుతున్నాయి. కొన్ని 'అతి' గా ఉండడంతో పోలీసులు కూడా యాక్షన్ తీసుకోక తప్పడం లేదు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి గ్రామాల్లోని యువత కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని లైక్‌లు, షేర్ల కోసం చేసిన ప్రయత్నాల్లో చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రైలు పట్టాలపై ఒక యువకుడు వింత విన్యాసం చేస్తూ కనిపించాడు. రైల్వే ట్రాక్‌పై బైక్‌తో రైలు ఇంజిన్‌ను లాగేందుకు ప్రయత్నించాడు. బైక్ తో లాగలేమని తెలిసి కూడా అతడు చేసిన వీడియో వైరల్ అవ్వడమే కాకుండా.. పోలీసుల దృష్టిని కూడా ఆకర్షించింది. దీంతో ఆ యువకుడిపై కేసు నమోదైంది.

రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు ఈ ప్రమాదకర విన్యాసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోల, యువకుడు తన బైక్‌ను రైలు ఇంజిన్‌కు తాడుతో కట్టివేశాడు. రైలు ఇంజిన్‌కు బైక్‌ను కట్టి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ, రైల్వే ట్రాక్‌పై తన బైక్‌ను ఉపయోగించి రైలును లాగడానికి ప్రయత్నిస్తాడు. రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా ఉన్న బైక్‌ తో ఈ విన్యాసాలు చేశాడు. వైరల్ వీడియోను పోలీసులు గ్రహించి రైల్వే ట్రాక్‌పై ఈ ప్రమాదకరమైన విన్యాసాలు చేసినందుకు యువకుడిపై ఫిర్యాదు నమోదు చేశారు. డియోబంద్‌లోని మజోలా గ్రామానికి చెందిన విపిన్ కుమార్ అనే యువకుడిని అరెస్టు చేశారు. అయితే ఈ వీడియో పాతదని చెబుతున్నారు.


Tags:    

Similar News