Alekhya Chitti Pickles: ఆసుపత్రిలో అలేఖ్య.. ఇకనైనా ఆపండి ప్లీజ్
మీ పికిల్స్ చాలా ఎక్కువ ధర ఉన్నాయంటూ అడిగిన ఓ కస్టమర్;

'అలేఖ్య చిట్టి పికిల్స్' అంటూ కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మీ పికిల్స్ చాలా ఎక్కువ ధర ఉన్నాయంటూ అడిగిన ఓ కస్టమర్ ను ఇష్టానుసారం తిట్టిన ఆడియో రాత్రికి రాత్రే వైరల్ అయింది. దీనికి ఇప్పటికే అలేఖ్య అనే యువతి క్షమాపణలు కోరింది. అయితే సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆసుపత్రి పాలైందంటూ ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తమ సోదరిపై ఇకనైనా ట్రోలింగ్ ఆపాలంటూ వారు వేడుకున్నారు.
కొన్ని నెలల కిందటే తమ తండ్రి మరణించారని, ఇక మా ఇంట్లో మరో చావు చూడకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ పచ్చళ్ళ వ్యాపారం నాశనమైందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాలని అలేఖ్య చిట్టి పికిల్స్ ఫ్యామిలీ కోరింది. ప్రస్తుతం తమ సోదరి ఐసీయూలో ఉందని, ఏమైనా జరిగితే బాధ్యత ట్రోలింగ్ చేసిన వ్యక్తులు, మీడియాదే అని తెలిపారు.