బాలకృష్ణకి ఎంత వయసొచ్చినా అతనిలోని ఎనర్జీ, చిలిపితనం ఏమాత్రం తగ్గలేదు. ఈ వయసులోనూ చకచకా సినిమాలు చేసేస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తున్న బాలకృష్ణ ప్రైవేట్ పార్టీలలో బాగా ఎంజాయ్ చేస్తాడు. గతంలో బాలకృష్ణ, వెంకటేష్, చిరు వంటి వారు మోహన్ బాబు కొడుకు పెళ్లిలో ఎంతలా ఎంజాయ్ చేసి అల్లరి చేసారో తెలిసిందే. బాలకృష్ణకి కాస్త కోపం ఎక్కువనే గానీ.. సినిమాల విషయంలో, పార్టీల విషయంలో అందరితో కలిసి అల్లరి చేస్తూ రెచ్చిపోతాడు. ఇక సినిమా సెట్స్ లోనూ బాలయ్య ఎనర్జీకి హీరోయిన్స్ కూడా ఆశ్చర్య పోతుంటారు. అయితే తాజాగా జరిగిన ఒక పార్టీలో బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ కి హీరోయిన్స్ కొంతమంది నోర్లెళ్లబెట్టేశారట.
మిడ్ నైట్ పార్టీలో...
తాజాగా బాలకృష్ణ సైమా అవార్డ్స్ కి దుబాయ్ వెళ్లాడు. అక్కడ అవార్డ్స్ ఫంక్షన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న బాలకృష్ణ ఆ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అయితే శనివారం రాత్రి అవార్డు కార్యక్రమం ముగిసిన వెంటనే దుబాయ్‌లో కొంతమంది స్టార్స్ తో మిడ్ నైట్ పార్టీ జరిగింది. ఇక ఈ మిడ్ నైట్ పార్టీలో దక్షిణాది నుంచి వచ్చిన సెలబ్రెటీలంతా పాల్గొన్నారు. ఇక అవార్డ్స్ ఫంక్షన్ అంటే.. అది పూర్తయ్యేసరికి దాదాపు మిడ్ నైట్ అవుతుంది. ఇక ఆ ఫంక్షన్ అవ్వగానే దుబాయ్ లోని హోటల్ లో ఈ పార్టీ రాత్రి 1 గంటలకు మొదలై తెల్లవారు జామున 5 గంటల వరకూ జరుగుతూనే ఉందట. ఇందులో బాలయ్యే సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారని... రాత్రంతా డాన్సులు చేస్తూ.. అక్కడి వాళ్లని ఎంటర్టైన్ చెయ్యడం దగ్గర నుండి.. అందరినీ చిల్ చేసాడట బాలయ్య బాబు. ఇక ఈ వయసులో బాలకృష్ణ అలా డాన్స్ లతో చెలరేగిపోతే... మిగిలిన హీరోయిన్లు, హీరోలు ఊరుకుంటారా..వారూ బాలయ్య చుట్టూ చేరి స్టెప్పులేశారట. హీరోయిన్స్ అంజలి, ప్రగ్యా జైస్వాల్, శ్రియ... బాలకృష్ణ అల్లరిలో పాలు పంచుకున్నారు. నిజంగానే బాలయ్య ఎనర్జీ లెవల్స్ పీక్స్ అనడానికి ఇదొక ఉదాహరణే.