టీడీపీతో బోయపాటికి బాగానే గిట్టుబాటు అయ్యిందే..!

వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ తర్వాత ఓ నెల రోజులు అజ్ఞాతవాసం చేసిన బోయపాటి తర్వాత అమరావతికి వెళ్లి టీడీపీ విజయం కోసం ఎన్నికల ప్రకటనలను [more]

;

Update: 2019-04-11 05:44 GMT
balakrishna boyapati movie
  • whatsapp icon

వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ తర్వాత ఓ నెల రోజులు అజ్ఞాతవాసం చేసిన బోయపాటి తర్వాత అమరావతికి వెళ్లి టీడీపీ విజయం కోసం ఎన్నికల ప్రకటనలను రూపొందించాడు. బోయపాటి కేవలం నెలన్నర కాలంలో టీడీపీకి చాలా యాడ్స్ చేసిపెట్టాడు. మరి ఈ నెలన్నరలో అన్ని యాడ్స్ ని తన టీంతో సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన బోయపాటికి టీడీపీ వారు అక్షరాలా ఐదు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని ఓట్లు పడతాయో కానీ.. బోయపాటి మాత్రం తన శక్తీమేర టీడీపీకి మేలు జరిగేలా యాడ్స్ చేసాడు. ఎన్నికలవేళ బోయపాటికి నెలన్నర టైం లోనే బాగానే గిట్టుబాటైంది. ఒక ఏడాది కష్టపడి సినిమా తీస్తే 10 కోట్లు తీసుకుంటున్న బోయపాటికి ఈ యాడ్స్ పారితోషకం మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది.

Tags:    

Similar News