మహానటి మూవీ హిట్ తో వైజయంతి మూవీస్ వారు వరసగా సినిమాలు నిర్మిస్తూ బాగా బిజీ అయ్యారు. మహేష్ తో భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'లో వన్ అఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న అశ్వినీదత్.. నాగార్జున, నానితో 'దేవదాస్' అనే మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మీడియం బడ్జెట్ భారీ అంచనాలున్న 'దేవదాస్' చిత్రం తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకుంది. ప్రమోషన్స్ ని భారీ గా మొదలు పెట్టిన 'దేవదాస్' టీం సినిమా మీద మరింత క్రేజ్ పెరిగేలా చేస్తుంది. ఈ సినిమాలో నానితో రష్మిక జోడి కడుతుండగా... నాగార్జునతో ఆకాంక్ష సింగ్ జోడీ కడుతుంది.
హాలీవుడ్ సినిమా కథేనా..?
అయితే విడుదలకు సిద్ధమయిన 'దేవదాస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది. ఆ ట్రైలర్ లో నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ గా ఇరగదీస్తున్నారు. ఫన్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. 'దేవదాస్' సినిమా హాలీవుడ్ మూవీకి ఇన్ స్పిరేషన్ గా తెరకెక్కిందనే న్యూస్ బాగా హైలెట్ అయ్యింది. 'దేవదాస్' ట్రైలర్ చూసిన వారు ఈ సినిమా హాలీవుడ్ మూవీ 'ఎనలైజ్ దిస్' కి ప్రీమేకా అంటూ పెదవి విరుస్తున్నారు. రాబర్ట్ డీ నీరో, బిల్లీ క్రిస్టల్ ప్రధాన పాత్రలు తెరకెక్కిన ఈ హాలీవుడ్ చిత్రం 1999లో విడుదలై అప్పట్లో మంచి విజయం సాధించింది. మాఫియా డాన్ రాబర్ట్ డీ నీరో.. తనకున్న ఒక డిజార్డర్‌ను పోగొట్టుకోవడానికి సైకియాట్రిస్ట్ బిల్లీ క్రిస్టల్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. మరి ఇప్పుడు' దేవదాస్' ట్రైలర్ చూసాక అందరికీ ఆ సినిమానే గుర్తొస్తుంది అని అంటున్నారు.
ఇంత కష్టపడితే కాపీ అంటారా..?
అయితే ముంబై రైటర్ శ్రీధర్ రాఘవన్ ఈ కథ లైన్ అశ్వనీదత్ కి చెప్పడం.. ఆ లైన్ నచ్చడం.. ఆ కథని హీరోలకు చెప్పమని చెప్పడంతో.. నాగార్జునకు, నానికి ఆ కథ లైన్ వినిపించగా వారికీ కూడా నచ్చేసిందట. ఆ చిన్న స్టోరీ లైన్‌ని భూపతిరాజా కథగా రాస్తే.. సత్యానంద్ సహాయ సహకారాలు అందించడం.. తరవాత ఈ కథను ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఆలోచించి.. శ్రీరామ్ ఆదిత్యను నాగ్, నాని ఎంపిక చెయ్యడం.. మళ్లీ రచయితలతో కలిసి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొంత స్క్రిప్ట్ వర్క్ చేసి సినిమాగా మలిచాడని చెప్పాడు. మరి అంత జరిగాక ఈ సినిమా కాపీ అని ఎవరైనా అనుకుంటారా.. చూద్దాం శుక్రవారం విడుదలవుతున్న 'దేవదాస్' చూసాక అది ఎ'నలైజ్' దిస్ కి కాపీనా కదా అనేది తేలుతుంది.