‘మహర్షి’ ప్రొడ్యూసర్స్ మధ్య మనస్పర్థలు..?

‘మహర్షి’ సినిమా బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ అయిందని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. [more]

Update: 2019-04-30 10:41 GMT

‘మహర్షి’ సినిమా బడ్జెట్ ముందు అనుకున్న దానికంటే ఎక్కువ అయిందని టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినా నిర్మాతలకు మిగిలేది ఏమీ ఉండదని ప్రచారం జరుగుతుంది. పైగా ఈ సినిమాకి ముగ్గురు బడా నిర్మాతలు ఉన్నారు. ఒకవేళ లాభాలు వచ్చినా ముగ్గురు పంచుకుంటే ఏమాత్రం సరిపోదు. అయితే ఇక్కడ దిల్ రాజు – పీవీపీల వాదన ఏంటంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగినా తమకు చిల్లిగవ్వ కూడా మిగలలేదని అంటున్నారు. సినిమాపై పెట్టిన పెట్టుబడికి అది సరిపోయిందని, ఇది లాభాలులేని వెంచర్ అని అంటున్నారట. ఇందులో నిజం లేకపోలేదు.

10 కోట్లైనా లేకపోతే ఎలా..?

అశ్వనీదత్ మాత్రం ఈ సినిమా నుండి కనీసం తన వాటాగా రూ. 10 కోట్ల లాభం ఆశిస్తున్నారట. ఈ సినిమాకి తనకు కనీసం రూ. 10 కోట్లైనా లాభం లేకపోతే సూపర్ స్టార్ సినిమా తీసి ఎందుకు అంటున్నారు. పైగా ఇటువంటి భారీ సినిమాకి తమ బ్యానర్ పేరు ఎందుకు వేయడం… పోస్టర్ మీద మాత్రమే తమ బ్యానర్ పేరు ఉండి ఏం లాభం అనేది ఆయన వెర్షన్. మరి మహేష్ చొరవ తీసుకొని ఇద్దరు సీనియర్ల మధ్య సయోధ్య కుదురుస్తాడా లేదా చూడాలి. నెల రోజులు నుండి వరుసగా సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నారు కానీ ఏదీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మరి ఈ ఈవెంట్ లో నిర్మాతలు ఏం మాట్లాడతారో చూడాలి.

Tags:    

Similar News