ఈ మధ్య తెలుగు సినిమాల్లో ముద్దు సన్నివేశాలు కామన్ అయిపోయాయి. యూత్‌ని థియేటర్ోకి రప్పించడంలో కిస్సింగులు కీలకమనే విషయాన్ని దర్శకనిర్మాతలు బాగా గుర్తించినట్టున్నారు. దీంతో ఏమాత్రం అవకాశం ఉన్నా వాటిని సినిమాల్లో చూపించేస్తున్నారు. తెలుగు సినిమాల ముద్దుల గురించి మాట్లాడితే మొదట గుర్తుకొచ్చేది 'అర్జున్‌రెడ్డి'నే. అంతకుముందు చాలా సినిమాల్లోనూ, ఆ తర్వాత వచ్చిన సినిమాల్లోనూ ముద్దులున్నాయి కానీ... 'అర్జున్‌రెడ్డి'లో ఉన్నన్ని ముద్దులు మాత్రం వేరే చిత్రాల్లో లేవు. ఆ చిత్రం నుంచి విజయ్ దేవరకొండ ముద్దుల స్పెషలిస్టుగా మారిపోయాడనే చెప్పాలి. దాంతో విజయ్ అనగానే ముద్దులుంటాయేమో అని ఊహిస్తారు.
రష్మిక కోరిక మేరకే...!
ఆ విషయంలో డిజప్పాయింట్ చేయకూడదనుకున్నారో ఏమో... ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో రూపొందిన 'గీత గోవిందం'లోనూ ముద్దు ప్లాన్ చేశారు. నిజానికి ఇది ముద్దు చుట్టూ తిరిగే కథే. బస్సులో ముద్దు గురించే గొడవంతా. అయితే అంతటితో వదిలిపెట్టలేదు. సినిమా క్లైమాక్స్ లో కూడా ఓ మంచి ముద్దు సన్నివేశం షూట్ చేశారు. అది చాలా హాట్ ముద్దు. ఒకరిపై మరొకరు కూర్చుని ముద్దు పెట్టుకుంటారు. సినిమాలో మాత్రం దాన్ని చూపించలేదు. ఇద్దరూ ముద్దు కోసం దగ్గరవడంతో టైటిల్ కార్డ్స్ పడిపోతుంటాయి. కావాలనే ఆ కిస్ సీన్ కట్ చేశారని... 'గీత గోవిందం' రిలీజ్‌కి కొన్ని రోజుల ముందే రష్మిక పెళ్లిపై పుకార్లు రావడంతోనే అలా చేశారని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. రష్మిక కోరిక మేరకే ఆ ముద్దుని అలా ఆపేశారని తెలిసింది. సినిమా రిలీజ్‌కి ముందే లీక్ అయిన విషయం తెలిసిందే. లీకైన వెర్షన్లో విజయ్, రష్మికల మధ్య కిస్సింగ్ సీన్ ఉందట. అదీ మ్యాటరు..!