ఏంటి ఈ వార్త నిజమేనా..?

టాలీవుడ్ లో ప్రస్తుతం నటుడిగా తనకంటూ సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో అడవి శేష్ కి సంబంధించి వార్త వైరల్ అవుతుంది. గత రెండు రోజుల [more]

Update: 2019-02-20 06:11 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం నటుడిగా తనకంటూ సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో అడవి శేష్ కి సంబంధించి వార్త వైరల్ అవుతుంది. గత రెండు రోజుల నుండి ఈ వార్త సోషల్ మీడియాలో దూమారం రేపుతుంది. త్వరలోనే అడవి శేష్.. అక్కినేని వారి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట. అది కూడా నాగార్జున మేనకోడలు, అలనాటి హీరోయిన్ సుప్రియను మ్యారేజ్ చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాతో పరిచయమైన సుప్రియ ఆ తరువాత అన్నపూర్ణ స్టుడియోస్ ప్రొడక్షన్ పనులు చూసుకోవడం స్టార్ట్ చేసింది.

త్వరలో పెళ్లి ప్రకటన చేస్తారా..?

అయితే రీసెంట్ గా ‘గూఢచారి’ సినిమాలో అడవి శేష్ రిక్వెస్ట్ చేయడంతో స్పై క్యారెక్టర్‌లో నటించింది సుప్రియ. ఆ సినిమా షూటింగ్ సమంయలో వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తిందని అంటున్నారు.అంతేకాదు వీళ్ల ప్రేమను పెద్దల వరకు తీసుకెళ్లడానికి అన్నీ తానై వ్యవహరించిందట సమంత. వచ్చే నెలలో అడివి శేష్ పెద్ద అనౌన్స్‌ మెంట్ చేయబోతున్నానంటూ రీసెంట్ గా ట్వీట్ చేయడంలో బహుశా పెళ్లి వార్తేనని అనుకుంటున్నారు. మరి, ఈ వార్త పుకారో లేదా నిజమో తెలియాలంటే వేచిచూడాలి.

Tags:    

Similar News