క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. 'కథానాయకుడు, మహానాయకుడు' గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ నట జీవితంలో పోషించిన పలు పాత్రలను కథానాయకుడులో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రల్లో హైలెట్ గా నిలిచిన పాత్రలను బాలయ్య కూడా తన హావభావాలతో అదరగొడుతున్నాడట. ఇప్పటికే 'కథానాయకుడు 'షూటింగ్ పూర్తి కావొచ్చిందని.. చిన్న చిన్న పనులు తప్ప షూటింగ్ పెద్దగా బ్యాలెన్స్ లేదంటున్నారు.
ఆర్జీవీ అడ్డురావడంతో...
ఇక 'మహానాయకుడు' షూటింగ్ కూడా క్రిష్ ఎప్పుడో మొదలు పెట్టేశాడని... సినిమా విడుదలకు సమయం లేకపోవడంతో క్రిష్ నిర్విరామంగా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడని... ఈ సినిమాని సంక్రాంతికి మొదటి భాగం రిపబ్లిక్ డేకి రెండో భాగం విడుదల చెయ్యడానికి మేకర్స్ ఎప్పుడో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్నీమధ్యన రామ్ గోపాల్ వర్మ కూడా తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని ఎన్టీఆర్ బయోపిక్ 'మహానాయకుడి'కి పోటీగా విడుదల చేస్తానంటూ చెప్పడంతో... క్రిష్ - బాలకృష్ణ ఎన్టీఆర్ 'మహానాయకుడు' పోస్ట్ పోన్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి.
బయ్యర్ల గోల భరించలేక...
కానీ ఇప్పుడు 'మహానాయకుడు' నిజంగానే పోస్ట్ పోన్ అయ్యేలా కనబడుతుంది. రామ్ గోపాల్ వర్మ కి భయపడి కాదు కానీ... బయ్యర్ల గోల పడలేకపోతున్నారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలను రెండు వారాల గ్యాప్ లో విడుదల చేస్తామని చెప్పారు. 'కథానాయకుడు' జనవరి 9 న 'మహానాయకుడు' జనవరి 24 విడుదల అంటూ ప్రకటించారు. అయితే రెండు వారాల గ్యాప్ తో ఈ రెండు పార్ట్ లు ప్రేక్షకుల ముందుకు రావడం.... తమకి గిట్టుబాటు కాదనే అభిప్రాయాన్ని బయ్యర్లు వ్యక్తం చేశారట. అయితే బయ్యర్లు చెబుతున్న మాట కూడా వాస్తవమే గనక 'మహానాయకుడు' సినిమా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఇదెంతవరకు కరెక్ట్ అనేది ఎన్టీఆర్ చిత్ర బృందమే స్పందించే వరకు తెలియదు.