క్రిష్ కి గందరగోళం ఎందుకు..?

Update: 2018-12-06 07:27 GMT

నందమూరి తారక రామారావు అంటే ఒక పుస్తకం. ఎంత తెలుసుకున్నా ఇంకా ఆయన గురించిన విషయాలు మిగిలే ఉంటాయి. ఎన్టీఆర్ మరణించే వరకు ఆయనతో తిరిగిన సన్నిహితులు తప్ప ఆయన గురించిన విషయాలు కూలంకషంగా ఎవరికీ తెలియవు. ఆఖరుకి ఆయన కొడుకులకి కూడా. అయితే ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ... సినిమా విషయాలు తెలిసిన సన్నిహితులకు, రాజకీయ విషయాలు తెలియవు. రాజకీయ విషయాలు తెలిసిన వారికీ ఎన్టీఆర్ నట జీవితం పూర్తిగా తెలియదు. ఇప్పుడు ఇదే విషయంలో ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు క్రిష్ కాస్త గందరగోళ పడుతున్నాడట. ఎన్టీఆర్ గురించి పూర్తిగా తెలుసు అనుకోవడం ఎంత పొరపాటో ఇప్పుడు బాలయ్య కి, క్రిష్ కి అనుభవంలోకి వస్తుందట.

రోజుకో కొత్త సీన్...

ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తీస్తూ.. అన్ని విషయాలను ఐదున్నర గంటల్లో రెండు పార్ట్ లుగా విభజించి చూపించొచ్చు అనే క్రిష్, బాలయ్య ల నిర్ణయం అభినందనీయం. అలాగే బిజినెస్ పరంగానూ లాభసాటి వ్యాపారం. అయితే కావాల్సినంత నిడివి దొరకడంతో క్రిష్, ఎన్టీఆర్ గురించి తెలుసు అని అనుకున్న సీన్స్ అన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా క్రిష్ కి పైన చెప్పిన సమస్య పురుగులా తొలిచేస్తోంది. అదేమంటే క్రిష్ పక్కాగా స్క్రిప్ట్ లో ఎన్టీఆర్ గురించి తెలుసుకున్న సీన్స్ అన్ని తీసుకుంటూపోతున్నాడట . ఆ సీన్స్ తో పాటుగా... రోజుకో కొత్త ఆలోచ‌న‌, కొత్త సీనూ పుట్టుకు రావడం, ఎన్టీఆర్ గురించి రోజుకో కొత్త విషయం తెలియడంతో ఆ సీన్స్ ని కూడా క్రిష్ తీసుకుపోతున్నాడట.

సినిమాలో ఎన్ని సీన్స్ ఉంటాయో...

మరి తాను తీసిన సన్నివేశాల్లో ఎన్ని సినిమాలో ఉంటాయో కూడా తెలియనంతగా క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నాడట. మరి ఎన్టీఆర్ గురించి రోజుకో విషయం తెలియడంతో.. అందులోని ఆసక్తితో కొన్ని, బాలయ్య చెప్పినవి కొన్ని ఇలా తెలియకుండానే సీన్లు పెరుగుతూ పోతున్నాయి అని సమాచారం. అసలే యమ ఫాస్ట్ ఉన్న క్రిష్ అనుకున్నవి అనుకున్నట్టుగా, తోచినవి తోచినట్టుగా గబగబా ఎన్టీఆర్ బయోపిక్ షూట్ ని పూర్తి చేస్తున్నాడట. మరి అన్ని సీన్స్ తీసేస్తున్న క్రిష్ ఆయా సీన్స్ ని సినిమాలో ఎక్కడ కలపాలి, అవి ఎక్కడ పెడితే అతుకుతాయో అనేది తలకు మించిన భారమవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూద్దాం ఫైనల్ గా కథానాయకుడు, మహానాయకుడులో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి అనేది.

Similar News