మహేష్ కు మరీ అంత రెమ్యునరేషనా..?
మహేష్ బాబు దర్శకుడు సుకుమార్ ని పక్కన పెట్టేసి ఎఫ్ 2తో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టడానికి సిద్దమవుతున్నాడు. ఈ [more]
మహేష్ బాబు దర్శకుడు సుకుమార్ ని పక్కన పెట్టేసి ఎఫ్ 2తో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టడానికి సిద్దమవుతున్నాడు. ఈ [more]
మహేష్ బాబు దర్శకుడు సుకుమార్ ని పక్కన పెట్టేసి ఎఫ్ 2తో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడితో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టడానికి సిద్దమవుతున్నాడు. ఈ మూవీని ఎఫ్ 2, మహర్షి నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. మహర్షికి సోలో నిర్మాతగా చెయ్యాలనుకున్న దిల్ రాజుకి అశ్వినీదత్, పీవీపీ తగిలినట్టుగా.. ఇప్పుడు అనిల్ రావిపూడి తో మహేష్ చెయ్యబోయే సినిమాకి అనిల్ సుంకర అనే మరో నిర్మాతతో కలిసి చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ప్రాజెక్టులోకి మహేష్ గత చిత్రాల నిర్మాత అనిల్ సుంకర ఎలా కలిసాడంటే… 14 రీల్స్ బ్యానర్ లో అనిల్ సుంకర భాగస్వామిగా మహేష్ తో తీసిన దూకుడు, 1 నేనొక్కడినే, ఆగడులో సినిమాల్లో ఒకే ఒక్కటి హిట్ అవడంతో అనిల్ సుంకర భారీగా నష్టపోయాడు. మహేష్ బాబు.. అనిల్ కి అప్పట్లో భవిష్యత్తులో నీతో ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడట.
బిజినెస్ లో సగం…
ఇక మహేష్ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలని అనిల్ సుంకరని ఈ సినిమాలో భాగస్వామిని చేసాడు. అయితే ఈ సినిమాకి మహేష్ బాబు ఆకాశాన్ని తాకే పారితోషకం అందుకోబోతున్నాడంటున్నారు. మహేష్ – అనిల్ రావిపూడి సినిమాకి జరిగే బిజినెస్ లో మహేష్ కి అర్ధభాగం ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నట్లుగా సోషల్ మీడియా టాక్. మరి ఈ మధ్యన మహేష్ సినిమాలు 100 కోట్ల పైనే బిజినెస్ జరుపుకుంటున్నాయి. ఇక అందులో అర్ధభాగం అంటే 50 కోట్ల పైనే మహేష్ పారితోషకం కింద అందుకోబోతున్నాడనే న్యూస్ టాలీవుడ్ విపరీతంగా వైరల్ అయ్యింది.