డైరెక్టర్ లేకుండానే ‘ఎన్.జి.కే’ చేసారా..?
హీరో – డైరెక్టర్ మధ్య బాండింగ్ కరెక్ట్ గా ఉంటేనే ఆ సినిమా అవుట్ పుట్ నీట్ గా వస్తుంది. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా [more]
హీరో – డైరెక్టర్ మధ్య బాండింగ్ కరెక్ట్ గా ఉంటేనే ఆ సినిమా అవుట్ పుట్ నీట్ గా వస్తుంది. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా [more]
హీరో – డైరెక్టర్ మధ్య బాండింగ్ కరెక్ట్ గా ఉంటేనే ఆ సినిమా అవుట్ పుట్ నీట్ గా వస్తుంది. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ఉండాలి. ఎక్కడో చోట ఇద్దరి మధ్య డిఫరెన్స్ రావడం ఈ మధ్య కాలంలో మాములు అయిపోయింది. కొంతమంది హీరోస్, డైరెక్టర్స్ అయితే మా సినిమా షూటింగ్ పిక్నిక్‌లా జరిగిందని.. అంతా ఫ్రెండ్స్‌లా కలిసిపోయి పని చేశామని చెబుతారు. కానీ అది కొన్ని సినిమాలకి మాత్రమే జరుగుతుంది. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే సూర్య తాజా చిత్రం ‘ఎన్ జి కే’ ఇలాంటి క్రియేటీవ్ డిఫరెన్స్ బారిన పడినట్టు చెన్నై వర్గాల టాక్.
హీరో, డైరెక్టర్ మధ్య విభేదాలు
డైరెక్టర్, హీరో మధ్య షూటింగ్ లో క్రియేటీవ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందుకే డైరెక్టర్ సెల్వ రాఘవన్ సినిమా షూటింగ్ చివరిలో వదిలి వెళ్లిపోయాడని టాక్ నడుస్తుంది. సెట్లో సూర్య – సెల్వ మధ్య విబేధాలు వచ్చాయని, దీంతో సెల్వ అలిగి షూటింగ్ కి డుమ్మా కొట్టాడట. అందుకే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా రావట్లేదని చెబుతున్నారు. ఇప్పుడు సెల్వ రాఘవన్ లేకుండానే సినిమా బయటకు వస్తోందని తెలుస్తోంది. ఈనెల 29న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. మరి ఇప్పుడు జరిగే ప్రమోషన్స్ కైనా సెల్వ వస్తాడా రాడా అనేది తెలియాల్సి ఉంది. అసలే సెల్వ సినిమాలు సరిగ్గా ఆడడం లేని ఈ టైంలో ఈ గొడవలు ఏంటో మరి.