ఆఫర్స్ తగ్గినా రెమ్యునరేషన్ మాత్రం తగ్గలేదు..!

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ అస్సలేం బాగోలేదు. ఆ మధ్య తెలుగులో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిన రకుల్ మహేష్ బాబుతో చేసిన [more]

Update: 2019-02-16 06:54 GMT

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ అస్సలేం బాగోలేదు. ఆ మధ్య తెలుగులో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిన రకుల్ మహేష్ బాబుతో చేసిన స్పైడర్ దారుణమైన రిజల్ట్ ని ఇవ్వడంతో అప్పటి నుంచి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అమ్మడుకి తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువ ఆఫర్స్ రావడంతో అక్కడే సెటిల్ అయిపోయింది. రీసెంట్ గా ఆమె నటించిన తమిళ చిత్రం దేవ్ సినిమా ఫ్లాపవ్వడంతో కాస్త ఆలోచనలో పడింది అమ్మడు. ఈమెకు తెలుగులో ఆఫర్స్ లేకపోయినా రెమ్యునేషన్ లో ఏ మాత్రం తగ్గడం లేదని టాక్. వెంకీమామ సినిమాతో పాటు మరో సినిమా ఆఫర్ కొట్టేసింది రకుల్.

మళ్లీ బెల్లంకొండ సరసన

రకుల్ మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జయ జానకి నాయక సినిమా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయినా బెల్లంకొండతో సినిమా చేయడానికి రెడీ అవుతుంది. ఈ మూవీకి కూడా రకుల్ కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ చిత్రం రాక్షసన్ రీమేక్ లో తెలుగు రమేశ్ వర్మ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.

Tags:    

Similar News