డైరెక్టర్ తో సాయి పల్లవి ప్రేమాయణం..?

తెలుగు, తమిళం, మలయాళంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. తెలుగులో ఈమె కోసం చాలామంది దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. కానీ సినిమా స్టోరీ, [more]

Update: 2019-03-28 06:17 GMT

తెలుగు, తమిళం, మలయాళంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. తెలుగులో ఈమె కోసం చాలామంది దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. కానీ సినిమా స్టోరీ, తన పాత్ర నచ్చితేనే ఓకే చేస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుండి సాయి పల్లవిపై ఒక రూమర్ వైరల్ అవుతుంది. సాయి పల్లవి ఒక తమిళ డైరెక్టర్ తో ప్రేమలో ఉందట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. అమలా పాల్ మాజీ భర్త ఏ.ఎల్.విజయ్. వీరి కాంబినేషన్ గతంలో ‘కణం’ సినిమా వచ్చింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి.

షూటింగ్ లోనే ప్రేమ..?

ఈ సినిమా షూటింగ్ టైంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందనీ.. ఇప్పుడు బలపడిందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. సాయి పల్లవి అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. మరి దీనిపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News