హీరో నాగార్జున కి తెలిసినంతగా డిప్లమేటిక్ గా ఉండడం బహుసా ఇండస్ట్రీ లో ఎవ్వరికీ తెలీదు కాబోలు. డైరెక్టర్ లూ , ప్రొడ్యూసర్ లూ, సినిమా వారు , పారిశ్రామిక వేత్తలూ, పొలిటీషియన్ లూ ఇలా ఒకరెంటి అనేకమంది తో దగ్గర సంబంధాలు ఏర్పరచుకుని సాగుతూ ఉంటారు నాగార్జున .
అలాగే ఎవరైనా టాలెంట్ ఉన్న మనిషి ఉంటేమాత్రం ఆయన పొరపాటున కూడా వదులుకోరు వారికి వీలైనంత సహాయం చెయ్యడం కోసమే నాగ్ ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం సినిమా తో సూపర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ కి అనేకసార్లు అవకాశం ఇచ్చారు నాగార్జున. తన సినిమా సోగ్గాడే చిన్ని నాయన దగ్గర నుంచే కొన్ని నాగ చైతన్య సినిమాల వరకూ నాగార్జున ఇప్పించిన ఛాన్స్ లే అనేకం ఉన్నాయి. అయితే నాగార్జున తన కొడుకు కొత్త సినిమా హలో ని చాల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .. ఈ సినిమా విషయం లో మాత్రం అనూప్ నాగార్జున ని చాలా నిరుత్సహపరిచాడు అనే మాట వినిపిస్తోంది.
నాగార్జున తన ఓన్ స్టైల్ లో విక్రం - అనూప్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని నమ్మి ప్రాజెక్ట్ ఇస్తే అనూప్ మ్యూజిక్ సరిగ్గా ఇవ్వలేదు అనీ అందుకే నాగ్ ఒళ్ళు మండిపోయి ఉన్నాడు అంటున్నారు. కాగా ఇవాలే హలో ఆడియో విడుదల.