అమల - సమంత ల మధ్యన ఇరుక్కున్న నాగ్

Update: 2017-12-17 17:13 GMT

బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు .. అలాగే టాలీవుడ్ లో కొంతమంది ప్రముఖులు కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు . అటువంటి ప్రముఖుల లో అక్కినేని అమల కూడా ఉన్నారు. ఈమె ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ పండుగను తప్పక జరుపుకుంటారని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ వేడుకలలో నాగార్జున కూడా పాల్గొనడం పెద్ద విచిత్రమేమీ కాదు.అయితే ఈ సంవత్సరం వచ్చిన క్రిస్మస్ నాగార్జునకు ఒక సమస్య తెచ్చిపెట్టింది.

ఈ ఏడాది అక్కినేని ఇంటికి కోడలి గా సమంత ఎంట్రీ ఇచ్చినా సంగతి మనకు తెలుసు.ఈ క్రమంలో క్రిస్మస్ వేడుకలు కుటుంబ సమేతంగా జరుపుకుందామని కోడలు సమంత మామయ్య అయిన నాగార్జున ను, అమలతో పాటు అందరినీ ఆహ్వానించిందట. దీంతో నాగార్జున తన భార్య అమల నిర్వహించే క్రిస్మస్ వేడుక కు వెళ్లాలో, కోడల సమంత సెలబ్రేట్ చేసే క్రిస్మస్ వేడుకకు వెళ్ళాలో అర్థం కావడం లేదు ...ఎటు వెళ్ళాలో అర్ధం కాని నాగ్ తానే స్వయంగా ఈ విషయం చెప్పారు .. కన్ఫ్యూజ్ అవుతున్నానని నవ్వుతూ అన్నారు రీసెంట్ గా .అయితే ఈ క్రమంలో 2 వేడుకలు హైదరాబాదులో జరుగుతాయి కాబట్టి నాగార్జునగారు 2 వేడుకలు కవర్ చేసేసుకుంటారు కాబోలు

Similar News