తన వ్యాపారానికి పవన్ ని ఫుల్లుగా వాడుకుంటున్న నాగార్జున

Update: 2018-01-04 06:15 GMT

తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ హలో చిత్రం కి సంబంధించి ప్రమోషన్ లు పూర్తి అవడం తో తన కొత్త చిత్రం రంగుల రాట్నం మీద పూర్తి దృష్టి పెట్టాడు హీరో నాగార్జున. రాజ్ తరుణ్ హీరోగా రాబోతున్న ఈ సినిమా కి నాగార్జున ప్రొడ్యూసర్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అయ్యిందో ఎప్పుడు పూర్తి అయ్యిందో కూడా తెలీకుండా జరిగిపోయింది కథ మొత్తం.

శ్రీరంజని అనే లేడీ డైరెక్టర్ తో తెరకి ఎక్కిన ఈ సినిమా మీద నాగార్జున మంచిగానే డబ్బు పెట్టాడట. అప్పట్లో ఉయ్యాలా జంపాల తో రాజ్ తరుణ్ ని పరిచయం చేసిన నాగ్ ఇప్పుడు అదే తరుణ్ తో ఈ సినిమా నిర్మించాడు. చాలా తెలివిగా ఈ చిత్రాన్ని ఉన్నట్లుండి సంక్రాంతి రేసులోకి తెచ్చేశాడు నాగ్. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విశేషాన్నీ సోషల్ మీడియాలో పంచుకోలేదు. ఒక్క ప్రెస్ నోట్ కానీ.. ఒక్క యాడ్ కానీ లేదు. సరిగ్గా విడుదల కి పది రోజుల ముందు అత్యంత గొప్ప స్ట్రాటజీ తో విడుదల తేదీ ప్రకటించి సినిమా కి ప్రమోషన్ గ మోదలు పెట్టాడు . ట్రైలర్ కూడా ఇందాకే విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు నాగ్ . సరిగ్గా సంక్రాంతి కి పవన్ కళ్యాణ్ - బాలయ్య ల తో పోటీ కి దిగడం అంటే చాలా పెద్ద విషయం. కానీ ఆ కాన్సెప్ట్ నే చాలా తెలివిగా ప్రమోషన్ కి వాడుకుంటున్నాడు నాగార్జున.

'అమ్మో పవన్ కళ్యాణ్ తో పోటీ కి దింపాడు అంటే సినిమాలో ఏదో విషయం ఉండే ఉంటుంది " అని జనం అనుకుంటారు అనే సూపర్ డూపర్ ప్లాన్ వేసి పవన్ ని తన వ్యాపారానికి సూపర్ గా వాడుకుంటున్నాడు నాగ్.

Similar News