తెలుగు చలన చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నగరం నుండి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది ఈ క్రమంలో సీఆర్డీఏ కు కొన్ని ప్రతిపాదనలు చేసింది. రాజధాని ప్రాంతంలో అనంతవరం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలో 5,167 ఎకరాల్లో మీడియా సిటీని సిద్ధం చేస్తోంది.ఎంత వీలైతే అంత తొందరగా తెలుగు చలనచిత్ర రంగాన్ని అమరావతికి తీసుకురావాలని ఆంధ్ర ప్రభుత్వం ఆలోచన లో ఉంది.
ఈ క్రమంలో మీడియాకు సంబంధించి కొన్ని ప్రోత్సాహాలను రాయితీలను ఇస్తూ సినీ–టెలివిజన్ పరిశ్రమ, యానిమేషన్–వీఎఫ్ఎక్స్–గేమింగ్, డిజిటల్ యాడ్–సోషల్ మీడియా, టెలికం రంగాలను ప్రోత్సహిస్తుందట. ఈ క్రమంలో ఇక్కడ జరిగే షూటింగులకు ప్రొడక్షన్ ఖర్చులో కొంత మొత్తాన్నితిరిగి చెల్లించడం తో పాటు రాయితీలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం..అలాగే సినిమాకు సంబంధించి సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులను .. ఇచ్చేల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టాలీవుడ్ చిత్ర రంగాన్ని సరిగ్గా గమనిస్తే అందులో చాలావరకు ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే.ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే తెలుగు చలనచిత్ర ప్రముఖులు హైదరాబాదులో స్థిరపడిపోయారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తెలుగు చలనచిత్రరంగ పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టి ‘అమరావతి’కి తరలించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
ఈ క్రమంలో మొదటగా అమరావతి రాజధానికి మీడియా హౌస్ లను,రెండో దశలో అంతర్జాతీయ స్థాయిలో చలనచిత్రోత్సవాలు జరిపించాలని, తర్వాత స్టూడియో నిర్మించాలని సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులకు ప్రభుత్వం తరఫున ఆహ్వాన పలుకుతుండగా బాలీవుడ్ నటులైన అజయ్ దేవగన్,సుభాష్ ఘయ్లతో స్టూడియో నిర్మాణంపై చర్చలు జరిపింది.