నాగార్జున ఇండస్ట్రీలో ఎవరితోనూ విబేధాలు లేకుండా ఉంటాడన్న ఓపెన్ టాక్ ఉంది. తెలుగులో ఇటీవల ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో థియేటర్ల ఇబ్బందో లేదా రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. గతంలో నాగార్జున తనయుడు అఖిల్ డెబ్యూ సినిమా అఖిల్ రిలీజ్ టైంలో నాగార్జున అఖిల్ సోలో రిలీజ్ కోసం అప్పుడు చాలా సినిమాల నిర్మాతలపై బలవంతంగా ప్రెజర్ చేసి అఖిల్‌ను 2015 దసరా టైంలో సోలోగా రిలీజ్ చేశాడు.
అప్పుడు అదే దసరా రోజున రవితేజ బెంగాల్ టైగర్ కూడా రావాల్సి ఉంది. అయితే నాగ్ రంగంలోకి దిగినా వాళ్లు వెనక్కి తగ్గలేదట. అప్పుడు నాగ్ తన పరపతి వాడి అఖిల్‌కే అన్ని థియేటర్లు బుక్ చేయడంతో అప్పుడు బెంగాల్ టైగర్ టీంతో పాటు రవితేజ కూడా హర్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు నాగ్ - వర్మ కాంబోలో వస్తోన్న ఆఫీసర్ సినిమా మే 25 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అదే రోజు రవితేజ నేలటిక్కెట్ కూడా పోటీకి దింపుతున్నారు. నాగార్జున ఆఫీసర్ క్రైం యాక్షన్ ఎంటర్ టైనర్. రవితేజ నేలటికెట్ మాస్ ఎంటర్ టైనర్. దీంతో అసలే నాగ్ ఆఫీసర్‌కు బజ్ తక్కువుగా ఉంది. అదే రోజు రవితేజ సినిమా కూడా ఉంటే థియేటర్లు తక్కువ దొరకడంతో పాటు కలెక్షన్లపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది.
అసలే ఆఫీసర్‌కు బజ్ లేదు. ఆ రోజు రవితేజ సినిమా వస్తే మాస్, బీ, సీ సెంటర్లలో ఆ సినిమాకే థియేటర్లు ఇస్తారు. అప్పుడు ఆఫీసర్‌కు కష్టాలు తప్పవని నాగ్ భావిస్తున్నాడు. అయితే ముందుగా ఆఫీసర్ రిలీజ్ డేట్ ఇచ్చారు. ఇప్పుడు రవితేజ మాత్రం తన సినిమా డేట్ విషయంలో వెనక్కి తగ్గేలా లేడట. సినిమా అవుట్ ఫుట్‌పై ఉన్న ధీమాతోనే రవితేజ అండ్ నేలటిక్కెట్ టీం మే 25కు ఫిక్స్ అయ్యాడంటున్నారు.
ఇక ఇండస్ట్రీలో కొందరి టాక్ ప్రకారం నాగ్ గతంలో తన సినిమా విషయంలో పెట్టిన ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని రవితేజ ఇప్పుడు ఆ రివేంజ్ తీర్చుకుంటున్నాడని గుసగుసలు వస్తున్నాయి. మరో షాక్ ఏంటంటే అదే రోజు కళ్యాణ్‌రామ్ -తమన్నా కాంబోలో తెరకెక్కిన నా నువ్వే కూడా లాక్ అయ్యింది. ఆ సినిమా కూడా అదే రోజు వస్తే నాగ్ ఆఫీసర్‌కు మరిన్ని కష్టాలు తప్పవు.