రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని అతని పార్టీ జనసేన నీ సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే రోజా తో ఒక ఛానల్ లైవ్ డిబేట్ లో దూర్భాషలు ఆడారు ప్రొడ్యూసర్ , నటుడు బండ్ల గణేష్. రాయలేని భాష లో వారిద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. అయితే రోజా ని తిట్టిన విషయం లో గణేష్ మీద సీరియస్ అవుతున్నారు చాలా మంది.
కొందరు మహిళా సంఘాల వారు ఇప్పటికే గణేష్ సారీ చెప్పాలి అంటూ గొడవ చేస్తూ ఉండగా మరొక పక్క రోజా తన ఫేస్ బుక్ లో గణేష్ ఫోన్ నెంబర్ మరియూ ఇతర డీటెయిల్స్ పెట్టేసింది. దాంతో గణేష్ కి రెండు రోజుల నుంచీ వరస ఫోన్ కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ గొడవ తట్టుకోలేక రెండు రోజులు తన ఫోన్ ఆఫ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాడు బండ్ల గణేష్ దానికి సంబంధించి వైకాపా నాయకుల నుంచి సెటైర్లు వినిపిస్తున్నాయి కూడా.
వైసీపీ మహిళ నేత బండి పుణ్యశీల మాట్లాడుతూ, రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారని, ఆయనకు ధైర్యముంటే, స్విచ్చాన్ చేయాలని అన్నారు. బండ్ల గణేష్ విజయవాడ వచ్చి మాట్లాడాలని, అసలు, ఆంధ్ర రాజకీయాలు ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. బండ్ల గణేష్ బుద్దే చాలా తప్పుడు బుద్ధి అని ఆమె ఆరోపించారు.