జన సేన , పవన్ కళ్యాణ్ - గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మారు మోగుతోంది. మొన్నటి వరకూ అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా పని చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తదుపరి నిమిషం ఏపీ ప్రజలలో మూడు రోజుల సుడిగాలి పర్యటన మొదలు పెట్టారు.
DCI ఉద్యోగులు , పోలవరం , విజయవాడ మీదుగా ఇవాళ ఒంగోల్ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రసంగించారు. అనేక విషయాల మీద మాట్లాడిన పవ,న్ కృష్ణా నదిలో పడి చనిపోయిన వరద బాధితుల చావుల లో తనకీ బాధ్యత ఉంది అనీ, తెలిసో తెలీకో టీడీపీ - బీజేపీ లని సపోర్ట్ చెయ్యడం వల్లనే వారి మూర్ఖపు మ్యానేజ్మెంట్ కారణంగా నే వారంతా చనిపోయారు అనీ అందుకోసం కుటుంబాలు తనని క్షమించాలి అని కోరాడు. అయితే ఈ సభ లో పవన్ ఫాన్స్ కి ఒక వింత అనుభవం ఎదురైంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అజ్ఞాతవాసి, తన కొత్త సినిమాతో పవన్ వస్తున్న సందర్భంగా మొన్ననే ఈ సినిమా లోగో విడుదల చేసారు. దీనికి సంబంధించి కొన్ని టీషర్ట్ లు ప్రింట్ చేసుకున్న ఫాన్స్ జనసేన వారితో కలిసి ఈ టీ షర్టు లు ధరించి ఒంగోలు లో జనాన్ని కంట్రోల్ చెయ్యడం, సభ ఏర్పాట్లు చూడడం చేసారు.
అయితే జనసేన విషయం లో సినిమాల ప్రస్తావన రావడం కొంచెం కూడా ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వారిని చూసి వారిమీద కోప్పడ్డాడు అని సమాచారం. పవర్ స్టార్ కి సినిమాలనీ రాజకీయాలనీ కలపడం మొదటి నుంచీ ఇష్టం ఉండదు. అదే క్రమం లో వారికి వెంటనే గట్టి వార్నింగ్ ఇచ్చాడట కళ్యాణ్. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కావొద్దని వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.