దాదాపు రెండు సంవత్సరాలకి పైగా సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నాడు హీరో రవితేజ. అతని కెరీర్ లో చకా చకా సినిమాలు చేయడం తప్ప గ్యాప్ అనేది ఎరగని ఈ మాస్ మహారాజ్, అప్పట్లో వరల్డ్ టూర్ కి వెళ్ళాడు అనీ అందుకే గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అనీ అన్నారు. అయితే అదే టైం లో ఫిలిం నగర్ టాక్ వేరేలా వినపడింది.
వరస పరాజయాలతో ఉన్న రవితేజ దగ్గరకి ప్రొడ్యూసర్ లు రావాలి అంటే జంకుతున్నారు అనీ భారీ ఆశలు పెట్టుకున్న కిక్ 2 ప్లాప్ అవడం తో డిస్ట్రిబ్యూటర్ లు కూడా బెదిరిపోయారు అనేది అప్పట్లో వినపడిన మాట.ఆ తరవాత కాలం లో రవితేజ కనపడలేదు. రీసెంట్ గా రాజ ది గ్రేట్ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ టాక్ తో నడిచినా బ్రేక్ ఈవెన్ దగ్గరకి వచ్చే సరికి కుంటుపడింది. అయితే రవితేజ విషయం లో ఇప్పుడొక కొత్త రూమర్ వినపడుతోంది. అప్పట్లో అతను వరల్డ్ టూర్ వంక తో సైలెంట్ గా ఉన్నాడు అనీ ఇప్పటికీ ఆ ప్రవర్తన మార్చుకోవడం లేదు అనీ అంటున్నారు చాలా మంది. రవితేజ కనీసం పదికోట్లు ఇస్తే కానీ ఏ ప్రొడ్యూసర్ కీ సినిమా చెయ్యను అని తెగేసి చెప్పేశాడట.
హీరోగా అంత మార్కెట్ లేని రవి కి ఐదు కోట్ల వరకూ అయితే ఇచ్చుకోగలరు ప్రొడ్యూసర్ లు. కానీ పది అనే సరికి భయపడుతున్నారు. అయినా సరే అతని మొండితనం తగ్గించుకోవడం లేదు అని ఇండస్ట్రీ లో ఒక టాక్ నడుస్తోంది. రీసెంట్ గా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సినిమా కోసం పది కోట్లు + టాక్స్ కూడా రవి తీసుకున్నాడు అనేది టాక్.