మెగా అభిమానులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఎప్పుడు విడుదల అవుతుందా అని కళ్ళు కాయలు చేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు.తమ అభిమాన హీరో ఇండస్ట్రీ కి వచ్చి పది ఏండ్లు గడిచినా పట్టు మని పది సినిమాలు కూడా చేయలేదు అనే బాధ కూడా వారు వ్యక్తపరుస్తున్నారు . ఈ క్రమంలో హీరో రామ్ చరణ్ ఈ సారి అలాంటి పొరపాటు జరగకుండా బోయపాటి శీను సినిమా - రాజమౌళి మల్టీ స్టారర్ సినిమా కోసం పక్కా ప్లానింగ్ తో ఉన్నాడట.
మరో ప్రక్క సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న రంగస్థలం సినిమా మీద అనేక కథలు ప్రచారంలోకి వస్తున్నాయి... అది నిజమో కాదో సుకుమార్ కే తెలియాలి మరి .. ఇలా ప్రచారంలోకి వచ్చిన అనేక కథలను వింటూ వారి హీరో ను ఉహించుకుంటూ మెగా అభిమానులు ఊహా లోకంలో తేలుతున్నారు. ప్రస్తుతం బయటకు వచ్చిన కథల ప్రకారం రంగస్థలం సినిమా గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో సాగే సినిమా అని చెబుతున్నారు.
రంగస్థలం అనేది గ్రామం పేరు,ఆ గ్రామంలో ఇద్దరు పలుకుబడిన నాయకులూ ఉంటారు.. జగపతి బాబు - ప్రకాష్ రాజ్. ఆధిపత్యం కోసం నిత్యం గొడవ పడుతూ ఉంటారు.చిట్టిబాబు అలియాస్ చరణ్ అక్కడ బోటు నడుపుతూ పబ్బం గడుపుతూ ఉంటాడు. ఆ ఇద్దరిలో ఒకరికి విశ్వాసపాత్రుడిగా ఉంటాడు. ఊరందరికీ తలలో నాలిక లాంటి వాడు. గేదెలు కాసుకునే మహాలక్ష్మి అలియాస్ సమంతా ప్రేమ లో పడతాడు చిట్టిబాబు .అలాగే చిట్టిబాబు కు అన్నయ్య ఆది పినిశెట్టి రాజకీయ జూదంలో ఇరుక్కుని చిట్టుబాబు పనిచేసే భూస్వామికి వ్యతిరేకంగా ప్రెసిడెంట్ గా పోటీకి నిలబడతాడు. ఈ విధంగా కథ సాగుతుంది అని .. ఫిలింనగర్లో రంగస్థలం మీద వస్తున్న వార్తా విశేషాలు . అయితే మెగా అభిమానులు , తెలుగు ప్రేక్షకులకు గ్రామీణ రాజకీయ నేపథ్యంలో సాగే ప్రేమకథ లు బాగానే నచ్చుతాయి. కాబట్టి సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ.