ఏ కమెడియన్ అయినా హీరో అవ్వడం అనేది పెద్ద వింత తో కూడుకున్న విషయం ఏమీ కాదు. ఒకప్పటి రాజబాబు దగ్గర నుంచీ సునీల్ వరకూ అందరూ హీరో అవతారాలు ఎత్తుతూనే ఉన్నారు. అయితే సప్తగిరి అనే ఈ కొత్త కమెడియన్ తనదైన శైలి లో విపరీతంగా సినిమాలు తీస్తున్నాడు. మొన్ననే సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ వచ్చిన ఇతగాడు అది అతిపెద్ద ప్లాప్ అయినా కూడా రీసెంట్ గా సప్తగిరి LLB అంటూ ఎంట్రీ ఇచ్చి పరవాలేదు అన్నట్టే కలక్ట్ చేస్తున్నాడు. మరొక పక్క కామెడీ మీద బేస్ అయిన ఈ హీరో ఇప్పుడు డైరెక్టర్ గా కూడా అవాతరం ఎత్తే పనిలో పడ్డాడు.
ఇప్పుడు "సప్తగిరి వెడ్స్ సన్నీలియోన్", "సప్తగిరికి దెయ్యం పట్టింది" లాంటి సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇవి పట్టాలెక్కుతాయో లేదో తెలీదు. సప్తగిరి మళ్లీ యధావిధిగా కామెడీ వేషాలు వేసుకోవడమే నయం అనే కామెంట్లు అందరి నుంచీ వస్తున్నాయి. సప్తగిరి సినిమాల్లో దర్శకత్వం ఆలోచనలు చాలా చేస్తున్నాడు అనీ, కమెడియన్ నుంచి హీరో ఐన సునీల్ తో ఒక సినిమా తీయాలనేది మనోడు ప్లాన్ అంటున్నారు. బొమ్మరిల్లు నుంచి కందిరీగ వరకూ చాలా సినిమాలు సహాయ దర్శకత్వం వహించాడు. అందుకే ఇప్పుడు దర్శకత్వం వైపుకు దృష్టి మర్చడానికి ప్రణాళికలు వేసుకుంటున్నాడు. అయితే ఇన్ని సినిమాలకి చివరికి అతను డైరెక్ట్ చేస్తా అంటే కూడా డబ్బులు పెట్టే మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు అనేది అర్ధం కాని ప్రశ్న. తన సొంత ఊర్లో ఒక రియల్టర్ ని సప్తగిరి పట్టేసాడు అనీ అతని నుంచే తన సినిమాలు అన్నిటికీ డబ్బులు లాగుతున్నాడు అని సమాచారం.