అక్కినేని నాగార్జున అమలల ముద్దుల కొడుకు అయిన హీరో అఖిల్ ను డిసెంబర్ 22న మరోసారి రీ లాంచ్ చేస్తున్నారు . అక్కినేని నాగార్జున ప్రొడక్షన్ లో దర్శకుడు విక్రం కే .కుమార్ డైరెక్షన్లో నటించిన సింపుల్ స్టొరీ గా 'హలో' సినిమా తో అఖిల్ ను మళ్ళీ ప్రేక్షకుల ముందరకి తీస్కొస్తున్నారు . ఈ సందర్భంగా ఈ సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి .
సెన్సార్ బోర్డ్ “హలో “ చిత్రానికి ''యు'' సర్టిఫికేట్ వచ్చింది. సినిమాకు సంబంధించి ఎలాంటి కటింగులు జరగలేదట. సినిమాలో వైలెన్స్ ఉన్నా కూడా ఎక్కడా రక్తపు మరకలు లేకుండా చిత్రీకరణ చేసారు చిత్ర యూనిట్.విక్రమ్ కె కుమార్ హీరో అఖిల్ ను ఒక సింపుల్ లవ్ స్టోరీ తో చూపించడం జరిగింది. హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అంటున్నారు.
రొమాన్స్ అంటూ హద్దులు దాటేయలేదట.ముఖ్యంగా అనుప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతం చాల బాగా వచ్చింది అని సెన్సార్ సభ్యుల నుంచి వినపడుతున్న మాట. మరి అఖిల్ హలో తో నైనా తెలుగు ప్రేక్షకులను మేపిస్తాడో లేదో చూడాలి. అయితే ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమా సెల్యులార్ నుంచి కాపీ కొట్టారు అనే టాక్ మాత్రం సెన్సార్ తరవాత వినపడుతోంది. సెల్ ఫోన్ ల మాఫియా చేసే అజయ్ కి అఖిల్ అడ్డు పడ్డం అనుకోకుండా అతని ఫోన్ ని వారిదగ్గర మిస్ అవడం ఇలాంటివి ఆసక్తికరంగా తీసాడట డైరెక్టర్ విక్రం.