Healthy Tooths: మీ పళ్లు తెల్లగా ఉండటం లేదా.. మెరిసిపోవాలంటే అద్భుతమైన చిట్కాలు
Beauty Tips: తెల్లని పళ్లు మనల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తాయన్న విషయం అందరికి
Beauty tips: తెల్లని పళ్లు మనల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తాయన్న విషయం అందరికి తెలిసిందే. మన ముఖంలో అందంగా కనిపించేందుకు పళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. పళ్లు తెల్లగా ఉంటే మనం నవ్వినా, మాట్లాడిన ఎదుటి వారికి అందంగా కనిపిస్తాం. కానీ కొందరిలో పళ్లు పచ్చగా ఉంటాయి. కొందరిలో పుచ్చిపోయినట్లుగా ఉంటాయి. మరి కొందరిలో పళ్లపై చారలు ఏర్పడతాయి. దీని వల్ల వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. మి పళ్లు తెల్లగా మారడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు.
ఉప్పుతో..
టూత్ పేస్టులో ఉండే ఉప్పు తేలికపాటి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక రాపిడి ఏజెంట్‌గా పని చేస్తుంది. అందుకే దంతాలపై ఉన్న మరకలను తొలగించి తెల్లగా కనిపించేలా చేస్తుంది. పళ్లు ఇలా తెల్లగలేనివారు ఉప్పుతో రోజూ ఒకటి రెండు నిమిషాలు దంతాలను సున్నితంగా రుద్దుకోవడం మంచి ఫలితాలు ఇస్తుందని అంటున్నారు నిపుణులు. ఇంకో విషయం ఏంటంటే. గట్టిగా రుద్దితే పళ్లపై ఉన్న ఎనామిల్ అరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే నెమ్మదిగా కొద్దిసేపు మాత్రమే రుద్ది శుభ్రం చేసుకోవడం మంచిది.
గొబ్బరి నూనె..
అదేవిధంగా తెల్లటి దంతాల కోసం కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ నూనెను నోట్లో వేసుకుని పుక్కిలి పట్టాలి. కాసేపటి తర్వాత నూనెను ఉంచేసి దంతాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దాంతో పళ్లపై ఉన్న బ్యాక్టీరియా తగ్గుతుంది. కావిటీస్ వల్ల వచ్చే దంతక్షయ సమస్య పరిష్కారం అవుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్:
అలాగే పళ్లు శుభ్రం కావడానికి యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్‌ను నీటిలో కలిపి పుక్కిలి పట్టాలి. దాంతో దంతాలపై ఉన్న మరకలు తగ్గిపోతాయి. అయితే వెనిగర్‌కు ఆమ్ల స్వభావం అధికం, నేరుగా వాడితే దంతాలపై ఎనామిల్ క్షీణిస్తుంది. అందుకే దాన్ని నీటిలో కలిపి వాడాలి. ఈ మిశ్రమాన్ని రోజూ మౌత్ వాష్‌లా వాడితే మంచి ఫలితం కనిపిస్తుందంటున్నారు నిపుణులు.
బేకింగ్ సోడా
ఇకపోతే పళ్లు తెల్లగా కనిపించాలంటే బేకింగ్ సోడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బేకింగ్ సోడాను పేస్టుగా చేసి వాడితే కూడా పళ్లు తెల్లగా మెరుస్తాయి. బేకింగ్ సోడా పేస్టుతో దంతాలను రోజూ సున్నితంగా 1 నుంచి 2 నిమిషాలపాటు శుభ్రం చేసుకోవాలి. ఇది పళ్ల మీద మరకలను తొలగిస్తుంది. అంతేకాదు నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను కూడా తగ్గిస్తుంది.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.