అధిక రక్తపోటు సమస్య ఉందా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుండె సంబంధిత సమస్యలు పెరిగే వారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా వివిధ ర
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుండె సంబంధిత సమస్యలు పెరిగే వారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆహారం మీ రక్తపోటు స్థాయిలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా 59 శాతం మహిళలు, 49 శాతం మంది పురుషులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నారు . ఇది గుండెపోటు, స్ట్రోక్‌తో సహా ప్రాణాంతక గుండె సమస్యలకు దారితీస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. మీరు తినే కొన్ని ఆహారాలు, పదార్థాలు మీ రక్తపోటును పెంచుతాయి. అందుకే ఆహారం ఎంపికలో జాగ్రత్త చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు..
ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు.
ఉప్పు, సోడియం:
మీ రక్తపోటు స్థాయి గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణాలలో ఉప్పు ఒకటి. పరిశోధకుల అధ్యయనాల ప్రకారం.. ఉప్పు రక్తంలో ద్రవ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఉప్పు ఆరోగ్యానికి ముఖ్యమైనది. అయినప్పటికీ, అతిగా తీసుకోవడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాల నుండి ఎక్కువ ఉప్పు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఉదాహరణకు, బ్రెడ్, పిజ్జా, శాండ్‌విచ్‌లు, కోల్డ్ కట్ మీట్‌లు, సూప్‌లు, టాకోస్, షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
మద్యం:
అతిగా మద్యం సేవించడం వల్ల మీ రక్తపోటు గణనీయంగా పెరుగుతుంది. రోజు తాగే వారిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వచ్చే ప్రమాదాలు పెరుగుతాయని అధ్యాయనిలు చెబుతున్నాయి., ఆల్కహాలిక్ పానీయాలు చక్కెర, కేలరీలతో నిండిన కారణంగా అధిక బరువు, ఊబకాయానికి ప్రధాన కారణం. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
ధూమపానం:
మీ ఆరోగ్యానికి హాని కలిగించే అతి పెద్ద అలవాట్లలో ఒకటి ధూమపానం. ధూమపానం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ధూమపానం మీ ధమనుల లోపల ఫలకం అని పిలువబడే కొవ్వు పదార్థాలను నిర్మించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ అని పిలువబడే పరిస్థితికి దారితీస్తుంది. ఇది చికిత్స చేయకుండా వదిలేస్తే గుండెపోటు, స్ట్రోక్‌లకు దారి తీస్తుంది.
అధిక రక్తపోటు లక్షణాలు:
అధిక రక్తపోటు ఉన్న చాలా మందికి లక్షణాలు కనిపించవు. ఇది నిశ్శబ్దంగా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా లక్షణాలు మైకము, తలనొప్పి, ముక్కు నుండి రక్తస్రావం, గందరగోళం, అస్పష్టమైన దృష్టి, శ్వాసలోపం, గుండె కొట్టుకోవడంలో తేడాలు, ఎరుపు లేదా గులాబీ రంగు మూత్రం రావడం.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.