గుండె జబ్బులున్నవారు నెయ్యి, వెన్న తినొచ్చా?

ఈ రోజుల్లో గుండె జబ్బుల వారి సంఖ్య పెరిగిపోతున్నాయి. మారుతున్న జీవనశైలి కారణంగా రకరకాల గుండె జబ్బులు వెంటాడుతున్నాయి.

Update: 2023-10-30 03:48 GMT

ఈ రోజుల్లో గుండె జబ్బుల వారి సంఖ్య పెరిగిపోతున్నాయి. మారుతున్న జీవనశైలి కారణంగా రకరకాల గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. అయితే గుండె జబ్బులతో బాధపడేవారు ఆహారంలో నెయ్యి, వెన్న తీసుకోవచ్చా..? అనే ప్రశ్న మాదిలో మెదులుతుంటుంది. మితంగా తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నెయ్యి, వెన్నలో సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు పెరగడానికి ఇదే కారణం అంటున్నారు నిపుణులు. గుండె జబ్బులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల ద్వారా తెలుసుకుందాం

పెద్దవారిలోనే కాదు యువతలో కూడా గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హార్ట్ పేషెంట్లు కూడా తమ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దీని ద్వారా ప్రమాదం పెరగకుండా జీవన విధానాన్ని ముందుకు సాగేలా చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆహారంలో ఎక్కువ కొవ్వు కలపడం వల్ల కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె జబ్బులు ఉన్న వారు నెయ్యి లేదా వెన్న తినకుండా ఉండటానికి కారణం ఇదే. హృద్రోగుల ఆహారపు అలవాట్లు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చాలా మంది గుండె జబ్బులున్న వారు తమ ఆహారంలో నెయ్యి, వెన్నకు దూరంగా ఉంటారు. అయితే నెయ్యి లేదా వెన్నని నిజంగా మానుకోవాలా లేక వాటిని ఆహారంలో చేర్చుకోవాలా అనేది ప్రశ్న ఉంటుంది.

నెయ్యితో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం

యోగా గురువు, యోగా ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు డాక్టర్ హంస యోగేంద్ర ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ఈ విషయంలో తరచుగా గందరగోళానికి గురవుతారని, నెయ్యి, వెన్నలో సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు పెరగడానికి ఇదే కారణం ఇదేనని అంటున్నారు.

ఇంట్లో తయారు చేసిన తెల్ల వెన్న, నెయ్యి తక్కువ మోతాదులో తినవచ్చని డాక్టర్ హంస యోగీందర్ చెబుతున్నారు. జున్ను, పప్పులు, కూరగాయలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టండి. చక్కెర, అధిక సోడియం వస్తువులను కూడా పరిమితం చేయండి. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు బదులుగా మీ ఆహారంలో తృణధాన్యాలు చేర్చండి.

ఇవే కాకుండా మీ ఆహారం, పానీయాలను నియంత్రించండి. మిమ్మల్ని మీరు వీలైనంత ఎక్కువగా హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. దీని కోసం ఎక్కువగా నీరు తాగండి. అలాగే హైడ్రేటెడ్ గా ఉండండి. మద్యం సేవించవద్దు మీ రక్తంలో చక్కెర, రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ పండుగలను ఆనందించండి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Tags:    

Similar News