Colorectal Cancer: మద్యం సేవిస్తూ బ్రెడ్‌ తింటున్నారా? డేంజరే.. అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు

క్యాన్సర్ అనే పదం వినగానే గుండెల్లో దడ పుడుతుంది. ఈ వ్యాధి సోకిందంటే చాలు బతికే అవకాశాలు చాలా తక్కువ. ముందస్తు ..

Update: 2023-12-14 02:45 GMT

Colorectal Cancer Risks

Colorectal Cancer Risks: క్యాన్సర్ అనే పదం వినగానే గుండెల్లో దడ పుడుతుంది. ఈ వ్యాధి సోకిందంటే చాలు బతికే అవకాశాలు చాలా తక్కువ. ముందస్తు క్యాన్సర్‌ లక్షణాలు గుర్తించి చికిత్స చేసుకుంటే బతికి బయటపడతాము. లేకుంటే అంతే సంగతి. వ్యాధి తీవ్రతరమై మరణానికి చేరువ కావాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్న మాట. ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి కారణంగా క్యాన్సర్‌ వ్యాధి వెంటాడుతోంది. చాలా మంది ప్రజలు వేయించిన ఆహారం, జంక్ ఫుడ్‌లకు అలవాటు పడుతున్నారు. మద్యపానం, ధూమపానం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది అనేక రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది క్యాన్సర్ మరణాలకు పెద్దపేగు క్యాన్సర్ కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇది పురీషనాళంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగే వ్యాధి. పురీషనాళం అనేది పెద్దప్రేగును పాయువుతో కలిపే మార్గం. కొన్నిసార్లు పురీషనాళంలో పాలిప్స్ అనే కణాలు అభివృద్ధి చెందుతాయి. కొంత కాలం తర్వాత ఈ కణాలలో కొన్ని క్యాన్సర్ కణాలుగా మారతాయి. ఈ వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్‌గా మారే పాలిప్స్‌ను తొలగించవచ్చు. కొలొరెక్టల్ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించడంలో స్క్రీనింగ్ పరీక్షలు సహాయపడతాయి.

జర్నల్ ఆఫ్ న్యూట్రియంట్స్‌లో ఇటీవల ప్రచురించిన ఒక నివేదిక షాకింగ్‌ విషయాలు తేలాయి. కొలొరెక్టల్ క్యాన్సర్‌లో జన్యుశాస్త్రం, ఆహారం రెండూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అమెరికన్ బయోబ్యాంక్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 139 రకాల ఆహారాలు, పోషకాలు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వ్యాధుల ప్రమాదం ఎలా పెంచుతాయన్న దానిపై అధ్యయనం నిర్వహించింది. ఇందులో దాదాపు 1,18,210 మంది పాల్గొన్నారు. పరిశోధన ద్వారా వందలాది మందికి పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించించారు. పెద్దప్రేగు క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్యాన్సర్‌లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు రెండవ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

అధ్యయనాలలో కొన్ని షాకింగ్‌ విషయాలు గుర్తించారు. ఆల్కహాల్ సేవిస్తూ వైట్ బ్రెడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నివేదిక తెలిపింది. ఒక వ్యక్తి ఆహార ఎంపికలు అనేది కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఏదీ ఏమైనా మద్యం తాగడం తగ్గించుకోవడం, వైట్ బ్రెడ్ తీసుకోవడం మానుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Tags:    

Similar News