రోజు కొద్దిసేపు ఎండలో కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

ఎండ చలి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. శీతా కాలంలో కాసేపు ఎండలో..

Update: 2024-01-02 03:30 GMT

Do You Know The Benefits Of Sitting In The Sun For A While?

శీతాకాలంలో శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకు కారణం శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గడమే. దానికి తోడు విపరీతమైన చలి, పొగ మంచు కారణంగా జలుబు, దగ్గు, చర్మ, జుట్టు సమస్యలు ఎదురవుతాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఈ సీజన్‌లో తీసుకునే ఆహారం, దుస్తుల విషయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. సరిగ్గా ఇదే సమయంలో ఎండ కోసం జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఎండ చలి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. శీతా కాలంలో కాసేపు ఎండలో కూర్చుంటే ఎన్ని లాభాలో తెలుసుకుందాం.

సరైన నిద్ర ఉంటుంది:

కాసేపు ఎండలో ఉండటం వల్ల ఒత్తిడి వంటివి కూడా దూరమవుతాయి. అంతే కాకుండా మీ శరీరం అంతర్గత గడియారం నియంత్రనలో ఉంటుంది. ఇది మీరు రాత్రిళ్లు సరిగ్గా పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది.

మానసిక స్థితి:

ఉదయం లేదా సాయంత్రం ఎండలో కూర్చోవడం వల్ల ఉల్లాసంగా ఉంటుంది. సూర్య రశ్మి న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ చేస్తుంది. దీని వల్ల సంతోషంగా ఉంచగలికే హార్మోన్లు రిలీజ్ అవుతాయి.

అధిక రక్తపోటు తగ్గుతుంది:

వింటర్ సీజన్‌లో ఎండలో కూర్చోవడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. సూర్యరశ్మి నైట్రిక ఆక్సైడ్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది అధిక రక్త పోటను తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకపోవడమే చాలా మంచిది.

 విటమిన్ డి:

ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు విటమిన్ డి చాలా అవసరం. శరీరానికి కావాల్సినంత విటమిన్ డి అందడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా రోగ నిరోధక శక్తి కూడా అందుతుంది. దీని వల్ల ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు.

చర్మం ఆరోగ్యంగా :

శీతా కాలంలో ప్రతిరోజు ఎండలో కాసేపు కూర్చోవడం వల్ల శరీరానికి విటమిన్ డి అనేది బాగా అందుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా విటమిన్ చాలా అవసరం. ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News