రోబో టాక్సీలను లాంచ్ చేయనున్న ఎలాన్ మస్క్

ప్రయాణాన్ని సులభతరం చేయడం, మరింత సమర్థవంతంగా వెళ్లేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. రోబో టాక్సీలను టెస్లా తయారు చేయనుంది

Update: 2022-04-10 05:58 GMT

టెస్లా, స్పేస్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. తమ కంపెనీ భవిష్యత్ రోబోటాక్సీ(futuristic robotaxis)లను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఇది తప్పనిసరిగా సెల్ఫ్-డ్రైవింగ్ టాక్సీ క్యాబ్‌లు అని ఎలాన్ తెలిపారు. ప్రయాణాన్ని సులభతరం చేయడం, మరింత సమర్థవంతంగా వెళ్లేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. దీని కోసం నిర్దిష్ట కాలపరిమితిని పెట్టుకోకుండా రోబో టాక్సీలను టెస్లా తయారు చేయనుంది. సెల్ఫ్-డ్రైవింగ్ టాక్సీలే భవిష్యత్తు అని మస్క్ చెప్పారు. టెక్సాస్‌లో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించిన సందర్భంగా ఎలాన్ మస్క్ ఈ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ ప్రత్యేక రోబోట్యాక్సీ తీసుకుని రాబోతున్నామని అన్నారు. 2019లో మస్క్ మాట్లాడుతూ.. టెస్లా పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను అభివృద్ధి చేస్తోందని, ఇది ఆటోమొబైల్స్ భవిష్యత్తుగా ఉంటుందని చెప్పారు.

మనం భారీ స్థాయికి వెళ్లబోతున్నాం. మానవజాతి చరిత్రలో ఏ కంపెనీ కూడా సాధించని స్థాయికి వెళ్ళబోతున్నామని మస్క్ అన్నారు. ప్రపంచాన్ని స్థిరమైన శక్తిగా మార్చడానికి అది జరగాలని అన్నారు. భారీ స్థాయి, పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ కి అంకితమైన రోబోటాక్సీ ఉండనుందని అన్నారు. కొత్త టెస్లా ఫ్యాక్టరీలను ప్రారంభించడం వల్ల ఉత్పత్తిని పెంచగలమని మస్క్ చెప్పారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ తాము కార్ల ఉత్పత్తిని సులభతరం చేస్తామని తెలిపింది. మస్క్ ఆప్టిమస్ అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రారంభించడం గురించి కూడా మాట్లాడారు. ప్రపంచాన్ని గొప్ప స్థాయికి మార్చబోతోందని మస్క్ అన్నారు.
ఇక ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో 9 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఇటీవలే ప్రకటించాడు. అతను కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలిచాడు. అంతేకాకుండా ట్విట్టర్ బోర్డులో కూడా నియమితుడయ్యాడు, ఇకపై ట్విట్టర్‌లో పెద్ద మార్పులు జరగబోతున్నాయనే ఊహాగానాలకు దారితీసింది.


Tags:    

Similar News