దీపావళి పండగ సమయంలో జీర్ణ సమస్యలు.. చెక్ పెట్టండిలా!
దీపావళి పండగ సందర్భంగా ప్రతి ఇళ్లల్లో స్వీట్లు, వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. దీపాల కాంతుల్లో..
దీపావళి పండగ సందర్భంగా ప్రతి ఇళ్లల్లో స్వీట్లు, వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. దీపాల కాంతుల్లో ఆనందోత్సవాల మధ్య ఘనంగా పండగను జరుపుకొంటారు. అయితే పండగ రోజున తినే పదార్థాలతో కడుపు సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు రావచ్చు అంతేకాకుండా స్వీట్లు ఎక్కువ తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరగడం, రక్తపోటు తదితర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా శరీరంలోని వ్యర్థాలు, ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే టాక్సిన్‌లను వదిలించుకోవడం చాలా అవసరం. అయితే దీపావళికి ముందు కొన్ని ఆయుర్వేద చిట్కాలు, శరీరం రోగనిరోధక శక్తిని పెంచడానికి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఆరోగ్యానికి ఉసిరి:
అయితే వేసవి, చలికాలం మధ్యలో మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని భావిస్తుంటారు. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి దీపావళికి ముందు ఉసిరికాయను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉదయాన్నే తీసుకోవడం వల్ల పేగులు సులభంగా శుభ్రం అవుతాయి. ఇందులో సి విటమిన్ ఉండటం వల్ల శరీరాన్ని శుభ్ర పర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. చాలా మంది ఉసిరికాయలో ఉప్పు కలిపి తింటుంటారు. కానీ ఇలా తినడం వల్ల ఉసిరికాయ బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో అందవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే ఊరగాయలు, చట్నీలు చేసేటప్పుడు ఉసిరికాయలో మసాలాలు, ఉప్పు ఎక్కువగా కలిపినా ఫలితం ఉండదంటున్నారు.
గోరువెచ్చని నీరు:
కొందరు మసాలాలు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో పలు రకాల సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి సమస్యలను నివారించాలంటే కొన్ని చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం. గోరువెచ్చని నీరు అద్భుతంగా పని చేస్తాయి. మసాల దినుసులు ఎక్కువగా తీసుకుంటే వాటిని బయటకు పంపేందుకు గోరువెచ్చని నీరు ఎంతగానో ఉపయోగపడేతేందపి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుష్కలంగా నీరు తాగడం, అలాగే ఉసిరికాయ రసం తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
లెమన్ హనీ వాటర్:
ఇవే కాకుండా నిమ్మకాయ రసంలో తేనెను కలుపుకొని తీసుకోవడం మంచి ఫలితం ఉంటుందని, దాల్చిన చెక్క, నిమ్మకాయ, తేనెను సాధారణ నాన్-బాయిల్ వాటర్‌తో కలిపి రోజంతా హైడ్రేట్ గా ఉంచడానికి ఉపయోగపడుతుందంటున్నారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)