Fenugreek Leaves Benefits: మెంతికూరతో బోలెడు లాభాలు.. ఈ సమస్యలకు చెక్‌

ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఆకు కూరల్లో

Update: 2024-03-16 02:05 GMT

Fenugreek leaves benefits

Fenugreek Leaves Benefits:ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఆకు కూరల్లో మెంతు కూరతో ఉన్న ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. వేసవిలో ఆకు కూరలతో కొన్ని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. సూర్యుని వేడి వల్ల కలిగే హీట్ స్ట్రోక్ నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. మామూలుగా సమ్మర్‌ సీజన్‌లో డీహైడ్రేషన్‌కి కూడా మెంతికూర మంచి మందు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మెంతికూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం మెరిసిపోయి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

మధుమేహం..

ఇక మధుమేహం అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు డయాబెటిస్‌ ఉన్నవారు పెరిగిపోతున్నారు. అయితే మధుమేహం ఉన్నవారికి షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు మెంతికూర అద్భుతంగా పని చేస్తుంది. మెంతులు తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక వరం. ఇన్సులిన్ మెకానిజంను మెరుగుపరచడం ద్వారా, ఇది రక్తంలో చక్కెర స్థాయిని హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. ఎండాకాలంలో తినడానికి చాలా ఆరోగ్యకరమైన ఆకుకూరల్లో మెంతి కూర ఒకటి.

అయితే మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా మెంతి కూర ఇష్టపడతారు. చాలా మంది మెంతి పరోటా, పకోడాలు, అనేక ఇతర రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. ఇందులో కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు, అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకోవచ్చు.

ఎసిడిటీ సమస్యను దూరం

అలాగే క్రమం తప్పకుండా మెంతి కూర తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యను దూరం చేసుకోవచ్చు. మీరు బరువు పెరుగుతున్నట్లయితే బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. అంతేకాకుండా మెంతికూర చర్మ సంబంధిత సమస్యలను సైతం దూరం చేస్తుంది. జలుబు, దగ్గుకు ఎంతో మేలు చేస్తుంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News