వేసవిలో గుండెకు రిస్క్ ఎక్కువ.. ఈ ఫ్రూట్స్ తో రక్షణ

పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు గుండెకు హాని కలగకుండా చూసుకోవాలి. వేసవిలో గుండె ఎక్కువగా రక్తాన్ని పంప్ చేయాల్సి..

Update: 2023-03-05 07:50 GMT

fruits that prevents from heart stroke

శీతాకాలం వెళ్లిపోయి.. వేసవి రానే వచ్చింది. వస్తూ వస్తూనే మండుటెండలను తెచ్చింది. రోజువారీ పనులకు వెళ్లే వారి నుంచి.. చిన్న పని నిమిత్తం బయటికి వెళ్లిన వారు కూడా.. ఇప్పటి నుండే ఎండలకు హడలిపోతున్నారు. ఎండలో బయటికి వెళ్లొస్తే దిమ్మతిరిగినట్టు ఉంటుందని బెంబేలెత్తిపోతున్నారు. వైద్యులు సైతం చిన్నారులు, వృద్ధులు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మిగతా వయసు వారు కూడా పనిలేకుండా ఎండలో తిరగరాదని హెచ్చరిస్తున్నారు.

కాగా.. ఇటీవల కాలంలో చాలా వరకూ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. వేసవిలో గుండెను ఇంకాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు గుండెకు హాని కలగకుండా చూసుకోవాలి. వేసవిలో గుండె ఎక్కువగా రక్తాన్ని పంప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి.. గుండెపోటు వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. ఉష్ణోగ్రతలను తట్టుకునేలా శరీరంలో నీరు, లవణాలు ఉండేలా చూసుకోవాలి. లవణం కోసమని చాలా మంది ఉప్పు ఎక్కువగా తీసుకుంటారు కానీ.. దాని వల్ల గుండెకు హాని కూడా జరగవచ్చు. అందుకే దానిస్థానంలో రోజులో కనీసం 4 లీటర్ల నీరు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవిలో పుచ్చకాయ, కమలాపండు, బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు, బొప్పాయి, కీరదోస వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. మంచి పోషకాలు కూడా లభిస్తాయి. ఇందులో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది కనుక..శ్యాసకోస వాపులను, అనారోగ్యం బారిన పడటాన్ని తగ్గిస్తుంది. అలాగే బొప్పాయి లోనూ విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వాటితో పాటు పపైన్ అనే కాంపౌండ్ కూడా ఉంటుంది. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఫలితంగా హార్ట్ఎటాక్ రిస్క్ తగ్గుతుంది.
కీరదోస.. ఇది కళ్లకే కాదు.. ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. కీరదోసలోనూ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సీ, ఫైబర్ లభించే కీరదోసను ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్యులు. ఫ్లాక్స్ సీడ్స్, చియాసీడ్స్ తోనూ గుండెకు రక్షణ లభిస్తుంది. వీటిల్లో యాంటీ ఆక్సిెెడెంట్లు ఉంటాయి. వెల్లుల్లి వల్ల కూడా హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది. వెల్లుల్లికి రక్తాన్ని పలుచబరిచే గుణం ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ నూ తగ్గిస్తుంది.






Tags:    

Similar News