హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా? ఎలాంటి పాలసీ తీసుకోవాలి?

Health Insurance Policy: ఈ రోజుల్లో చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. కోవిడ్‌ తర్వాత ఇన్సూరెన్స్‌ ..

Update: 2023-11-23 14:04 GMT

Health Insurance Policy: ఈ రోజుల్లో చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. కోవిడ్‌ తర్వాత ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు హెల్త్‌ పాలసీలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అనారోగ్య సమస్యలు వస్తే ఆస్పత్రి బిల్లు తడిసిమోపెడవుతుంటుంది. అందుకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉండటం చాలా ముఖ్యం. అయితే మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే ముందు ఎలాంటి పాలసీలు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటాయి..? ఎంత కవరేజీకి ఎంత ప్రీమియం చెల్లించాలి..? తదితర వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని గుర్తించుకోండి.

హెల్త్ సర్వీసెస్‌ రేటు సాధారణ ద్రవ్యోల్బణం రేటు కంటే దాదాపు రెండున్నర రెట్లు పెరుగుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.02 శాతంగా ఉంది. అయితే ఆరోగ్య సంరక్షణ ఖర్చు చాలా కాలంగా 14 శాతం ద్రవ్యోల్బణాన్ని చూసింది. చిన్న చిన్న జబ్బుల చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అందుకే మీ కుటుంబానికి తగిన బీమా కవర్ తీసుకోండి. మీరు చిన్న పట్టణంలో నివసిస్తుంటే పెరుగుతున్న చికిత్స ఖర్చులను పరిశీలించి మీకు 10 లక్షల రూపాయల కవర్ ఉండాలి. మెట్రోలలో 20 లక్షల రూపాయల వరకు కవరయ్యే విధంగా ఉండాలి.

ఎలాంటి పాలసీని ఎంచుకోవాలి?

ఇందులో రెండు రకాల ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నాయి. ఇండివిజువల్, ఫ్యామిలీ ఫ్లోటర్. మీ కుటుంబంలోని నలుగురికీ ఒక్కొక్కరికి 10-10 లక్షల రూపాయల చొప్పున ప్రత్యేక పాలసీలు తీసుకుంటే.. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది ఉంటుంది. అందుకే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవచ్చు. 10 లక్షల రూపాయల ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే.. ఆ కుటుంబంలోని ఎవరైనా అవసరమైతే 10 లక్షల రూపాయల వరకు చికిత్స పొందవచ్చు. ఇక మీ పాలసీదారుని భార్య తన చికిత్స కోసం 3 లక్షల రూపాయలను ఉపయోగించినట్లయితే, మిగిలిన సభ్యులు 7 లక్షల రూపాయల వరకు చికిత్స పొందవచ్చు.

ఇక గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? చిన్న పట్టణాలతో పోలిస్తే మెట్రోపాలిటన్ నగరాల్లో చికిత్స పొందడం కొంత ఖరీదైనదిగా ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లో డెంగ్యూ చికిత్సకు 50 వేల రూపాయలు ఖర్చు అయినట్లయితే అదే ఢిల్లీలోని అదే చికిత్సకు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అందుకే బీమా కంపెనీలు మీరు నివసిస్తున్న నగరం ఆధారంగా ప్రీమియంను ఉంటుందని గుర్తించుకోండి. చిన్న పట్టణాల్లో ఆరోగ్య బీమా ప్రీమియం 20 నుంచి 30 శాతం వరకు తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌ పాలసీదారు ఢిల్లీలో చికిత్స పొందితే బీమా కంపెనీ వారు క్లెయిమ్ చేసే పూర్తి మొత్తాన్ని అతనికి ఇవ్వదు. అలాంటప్పుడు పాలసీదారుడి తన సొంత జేబులో నుంచి 20 నుంచి 30 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది.


Full View


హాస్పిటలైజేషన్‌లో గది అద్దెపై ఖర్చు భారీగానే ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య విధానాలు ఒక శాతం వరకు గది అద్దె ఉప పరిమితిని కలిగి ఉంటాయి. మూడు లక్షల రూపాయలు కవర్‌ అయితే గది అద్దె రోజువారీ రేటు 3,000 రూపాయల ప్రకారం అందుబాటులో ఉంటుంది. అసలు గది అద్దె 5,000 రూపాయలు అయితే.. మీ జేబులో నుంచి 2,000 రూపాయలు చెల్లించాలి. బీమా కంపెనీ పూర్తి క్లెయిమ్‌ను ఇవ్వదు. బిల్లులో ముందుగా నిర్ణయించిన భాగాన్ని తప్పనిసరిగా మీ సొంత జేబు నుండి చెల్లింల్సి ఉంటుంది.

ద్రవ్యోల్బణం కారణంగా రూ. 5-10 లక్షల కవర్ ఎప్పుడు ఖర్చు అవుతుందో మనకు తెలియదు. ఈ రోజుల్లో, చాలా బీమా కంపెనీలు తమ ఆరోగ్య పథకాలలో పునరుద్ధరణ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. ఆరోగ్య కవరేజీ రూ. 5 లక్షలు. అయితే చికిత్స సమయంలో రూ. 6 లక్షలు అయినట్లయితే అటువంటి పరిస్థితిలో బీమా కంపెనీలు మీ పాలసీలో రూ. 5 లక్షల బీమా మొత్తాన్ని జోడిస్తాయి. చాలా కంపెనీలు మీరు సంవత్సరానికి 3 సార్లు బీమా మొత్తాన్ని పునరుద్ధరించగల ఫీచర్‌ను అందిస్తాయి.

ఇక ఇలాంటి ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునే వారికి నిపుణులు పలు సూచనలు, సలహాలు చేస్తున్నారు. మీ అధిక మొత్తంలో డబ్బులు ఉన్నట్లయితే వ్యక్తిగత పాలసీ తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక ఇబ్బందులు ఉంటే మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవచ్చని చెబుతున్నారు. ఆరోగ్య బీమా పాలసీని తీసుకునే ముందు, బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, నగదు రహిత ఆసుపత్రుల నెట్‌వర్క్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఇంటికి సమీపంలో ఉన్న మంచి ఆసుపత్రులను మీ పాలసీ నెట్‌వర్క్‌లో చేర్చాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్య బీమా చాలా ముఖ్యం. ఈ కవర్ ఎంత త్వరగా తీసుకుంటే అంత ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.

Tags:    

Similar News