Health Tips: రాత్రుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నారా? షాకింగ్‌ నిజాలు

టెక్నాలజీ మారుతున్నకొద్ది సమస్యలు పెరిగిపోతున్నాయి. మారుతున్న యుగంలో స్మార్ట్‌ ఫోన్‌ వాడకం పెరిగిపోయింది.

Update: 2023-11-08 16:46 GMT

టెక్నాలజీ మారుతున్నకొద్ది సమస్యలు పెరిగిపోతున్నాయి. మారుతున్న యుగంలో స్మార్ట్‌ ఫోన్‌ వాడకం పెరిగిపోయింది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు, మరి కొందరైతే అర్థరాత్రి వరకు కూడా ఫోన్‌లలోనే మునిగిపోతున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఫోన్ వాడకం అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగంగా మారిపోయింది. కానీ ఫోన్‌ వాడకం ఎక్కువైతే అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఫోన్‌లను అధికంగా వినియోగిస్తున్నారు. ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లను కూడా వినియోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇక ఎక్కువ సేపు స్రీన్ సమయం గడపుతుంటే నిద్ర భంగం కలుగుతుందని నిపుణులు ఎప్పుడూ చెప్పే మాట అందరికి తెలిసిందే. ఇక చాలా మంది అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా స్మార్ట్‌ ఫోన్‌లో మునిగి తేలేవారు చాలా మందే ఉన్నారు.

ఇలా రాత్రుల్లో కూడా ఫోన్‌ వాడకం వల్ల ప్రమాదమేనని చెబుతున్నారు నిపుణులు. అయితే ఫోన్ లేదా ఇతర ఉపకరణాలు ఎక్కువ సేపు వాడితే చర్మం, జుట్టు సమస్యలు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీవీ, ల్యాప్ టాప్, ఫోన్ నుంచి వచ్చే వెలుగు మన మెదడు పని తీరుపై ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రుల్లో పడుకోకుండా ఎక్కువగా ఫోన్‌ల ముందుగా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారరు.. స్కిరాడియన్ సైకిల్ పై ప్రభావం చూపడంతో నిద్ర సమయం తగ్గుతుంది. అలాగే ఇటీవల వెల్లడైన అధ్యయనాల ప్రకారం ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడిన కిరణాల కారణంగా రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల ఉత్పత్తి కారణం కావచ్చని తెలుస్తోంది. ఇది శరీరానికి అవసరమ్యే యాంటీ ఆక్సిడెంట్లకు కీడు చేయడంతో, జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫోన్‌ అతిగా వాడతే వచ్చే సమస్యలు:

మొబైల్, ల్యాప్ టాప్, టీవీ లను నుంచి వెలువడే కిరణాల వల్ల ముఖ్యంగా మొఖంపై మొటిమల సమస్య పెరుగుతుందని చర్మ వాధి నిపుణులు చెబుతున్నారు. అలాగే అకాల వృద్ధాప్యం, చర్మంపై ముడతల సమస్య వస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజిన్ ఉత్పత్తి పడిపోతుంది. లూపస్, రొసెమియా వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే జుట్టుపై స్క్రీన్ కిరణాలు పడడం వల్ల ఇబ్బంది లేనప్పటికీ ఎక్కువ సేపు ఫోన్ వాడడం వల్ల సిర్కాడియన్ చక్రం దెబ్బతింటుంది. దీంతో ఒత్తిడి సమస్య పెరిగి జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ వాడకాన్ని తగ్గిస్తూ, అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలడం, చర్మ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చీకట్లో ఎక్కువ సేపు ఫోన్ వాడుతుంటే కళ్లు పొడిబారడం, దురద, మంట, ఎర్రబడడం వంటి సమస్యలు రావచ్చు. రాత్రిపూట ఎక్కువ గంటలు ఫోన్‌ని ఉపయోగించే అలవాటును తొలగించడానికి, నిద్రను మెరుగుపరిచే ధ్యానం, విశ్రాంతి లాంటి కార్యకలాపాలను ఎంచుకోవాలి. వీలైనంతగా రాత్రి సమయంలో ఫోన్, ల్యాప్ టాప్ వాడకుండా పగలే పనిని పూర్తి చేసుకోవాలి. అలాగే తప్పనిసరై వాడాల్సి వస్తే ఫోన్ లో నైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిరణాల వల్ల కలిగే ఇబ్బందిని కొంత మేరక తగ్గించవచ్చు. నిపుణులు మాత్రం పడుకునే ముందు మాత్రం ఫోన్, ట్యాబ్ వాడకపోతే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.

క్యాన్సర్‌ ప్రమాదం..

నిద్రకు అరగంట ముందే ఫోన్ ఆఫ్ చేయాలి. స్మార్ట్‌ ఫోన్లు ఎక్కువగా వాడటం కారణంగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధనల తేల్చారు నిపుణులు. ఎందుకంటే మొబైల్ ఫోన్ ద్వారా ఎలక్ట్రానిక్ మాగ్నెటిక్ రేస్ విపరీతంగా రావడం కారణంగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఇటీలవ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో స్పష్టమైనట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.

బ్రెయిన్ ట్యూమర్ల ప్రమాదం

అనేక మంది మంది తమ మొబైల్ ఫోన్ ను క్రింది పాకెట్ లో పెట్టుకుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీని వల్ల రేడియేషన్ అనేది మన శరీరంలోకి చేరుతుంది. తద్వారా పురుషుల్లో ఉండే స్పెర్ము కౌంట్ విపరీతంగా పడి పోతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా రేడియేషన్ ప్రభావంతో బ్రెయిన్ ట్యూమర్ల ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఫోన్ల వాడకం వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావంతో ఆడవారిలో గర్భస్రావానికి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, చెవి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తల నరాల సమస్యలు, కంటి నరాలు దెబ్బతినటం జరుగుతుందని అంటున్నారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Tags:    

Similar News