అక్కడ మొదలైన 'వెస్ట్ నైల్ వైరస్' టెన్షన్

వెస్ట్ నైల్ వైరస్ మానవులకు సంక్రమించిన కేసులను ధృవీకరించారు

Update: 2022-08-28 07:59 GMT

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీలో కొత్త టెన్షన్ మొదలైంది. 'వెస్ట్ నైల్ వైరస్' మనుషుల్లో వ్యాపిస్తోందని అధికారులు గుర్తించారు. పబ్లిక్ హెల్త్ అధికారులు లాస్ ఏంజెల్స్ కౌంటీలో వెస్ట్ నైల్ వైరస్ మానవులకు సంక్రమించిన కేసులను ధృవీకరించారు. యాంటెలోప్, శాన్ ఫెర్నాండో, శాన్ గాబ్రియేల్ ప్రాంతాలలో ఆరు కేసులను నిర్ధారించారు. జూలై చివరలోనూ.. ఆగస్టు నెల ప్రారంభంలో చాలా మంది రోగులు అనారోగ్యానికి గురయ్యారని L.A. కౌంటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వైరస్ బారిన పడిన రోగులందరూ కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు.

లాస్ ఏంజిల్స్ కౌంటీలో వెస్ట్ నైల్ వైరస్ ప్రతి సంవత్సరం యాక్టివ్ గా ఉంటుంది. దోమలను నియంత్రిస్తే మాత్రం వీలైనంత అదుపు చేయవచ్చని యాంటెలోప్ వ్యాలీ మస్కిటో అండ్ వెక్టర్ కంట్రోల్ డిస్ట్రిక్ట్ జిల్లా మేనేజర్ లీన్ వెర్డిక్ అన్నారు. గత సంవత్సరం ఇదే కౌంటీలో ఈ వైరస్ సంక్రమించిన 17 కేసులను నివేదించారు. అప్పుడు 12 ఆసుపత్రిలో చేరగా.. ఒక మరణం సంభవించింది. అదే 2020లో 93 కేసులు నమోదవ్వగా 79 మంది ఆసుపత్రిలో చేరారు. ఏడు మరణాలు సంభవించాయి.
గత ఐదేళ్లుగా వెస్ట్ నైల్ వైరస్ చాలా మందికి సోకింది. కానీ పెద్దగా ప్రభావం చూపకపోవడం.. టెస్టులు తక్కువగా చేయించుకోవడం వంటివి జరిగాయి. ఒరిజినల్ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అధికారులు భావిస్తూ ఉన్నారు. L.A. కౌంటీ ప్రజారోగ్య అధికారుల ప్రకారం, నివేదించబడిన కేసుల్లో మూడొంతుల మంది తీవ్రమైన అనారోగ్యం పాలయ్యారు. దాదాపు 10% మంది మరణించారు. ఆరెంజ్ కౌంటీ హెల్త్ కేర్ ఏజెన్సీ మొదటి ఇన్‌ఫెక్షన్‌ని ధృవీకరించిన రెండు వారాల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. వెస్ట్ నైల్ వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. తమను తాము రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. ముఖ్యంగా 50.. అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు, తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రజలు తెల్లవారుజామున, సంధ్యా సమయంలో దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఉండకూడదని. ఆరుబయట ఉన్నప్పుడు ఫుల్ స్లీవ్స్ చొక్కాలు, ప్యాంటు ధరించాలని సూచించారు. ఇళ్లల్లో దోమలు ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.


Tags:    

Similar News