Health Tips: ఒత్తిళ్ల మధ్య గుండెను కాపాడుకునేందుకు చిట్కాలు

నేటి కాలంలో ఒత్తిడి మనలో ఒక భాగంగా మారింది. ఒక నిర్దిష్ట స్థాయి ఒత్తిడి సాధారణమైనప్పటికీ..

Update: 2023-11-15 16:02 GMT

Healthy Heart Tips : నేటి కాలంలో ఒత్తిడి మనలో ఒక భాగంగా మారింది. ఒక నిర్దిష్ట స్థాయి ఒత్తిడి సాధారణమైనప్పటికీ, అధిక, దీర్ఘకాలిక ఒత్తిడి మన ఆరోగ్యంపై ముఖ్యంగా మన గుండెపై ప్రభావం చూపుతుంది. GOQii ఇండియా ఫిట్ రిపోర్ట్ 22-23 ఒత్తిడి, మానసిక ఆరోగ్య అధ్యయనం ప్రకారం.. 24% మంది భారతీయులు ఒత్తిడితో సతమతమవుతున్నారు. ప్రధానంగా ప్రస్తుత పని పరిస్థితి, ఆర్థిక సమస్యలు కారణంగా చెప్పవచ్చని నివేదిక చెబుతోంది.

ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లోని సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తిలక్ సువర్ణ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఒత్తిడిని నిర్వహించడానికి, మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకోవలసిన చర్యలు చాలా ఉన్నాయని చెప్పారు.

1. యోగ, ధ్యానం చేయండి: మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం లేదా వాకింగ్‌ వంటివి చేయడం ద్వారా మీకు ఆనందం, ఒత్తిడి లేకుండా గడపవచ్చు.

2. యాక్టివ్‌గా ఉండండి: రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక శక్తివంతమైన ఒత్తిడి , గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కీలకం. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇవి సహజ మూడ్ లిఫ్టర్‌లు. చురుకైన నడక, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి వారానికి కనీసం 150 నిమిషాల మితమైన-తీవ్రత ఏరోబిక్ కార్యకలాపాలను లక్ష్యంగా పెట్టుకోండి.

3. ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి: సమతుల్య ఆహారం ఒత్తిడిని తగ్గించడంలో, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, పంచదార కలిగిన స్నాక్స్, అధిక సోడియం మీల్స్ అధిక వినియోగం మానుకోండి.

4. మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి: మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్ పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మైండ్‌ఫుల్ శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి మంచి ప్రయోజనాలు ఇస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కీలకమైనది. ఇలాంటివి పాటించడం వల్ల ఒత్తిడి నుంచి కాపాడుకోవడమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్ తిలక్ సువర్ణ తెలిపారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Tags:    

Similar News