నీటితో తడిసిన ఫోన్‌ను బియ్యంలో ఆరబెడితే మంచిదా?

మీ ఫోన్ నీటిలో తడిసిందా? ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తరచుగా ఎదుర్కొనే సమస్య. ఫోన్ నీటిలో పడిపోవడం ఎవరికైనా జరగవచ్చు.

Update: 2024-03-13 05:30 GMT

Mobile

మీ ఫోన్ నీటిలో తడిసిందా? ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తరచుగా ఎదుర్కొనే సమస్య. ఫోన్ నీటిలో పడిపోవడం ఎవరికైనా జరగవచ్చు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని సులభమైన పద్ధతులను అనుసరించడం ద్వారా మీ ఫోన్‌ను సేవ్ చేసుకోవచ్చు. నీటిలో నానబెట్టిన ఫోన్‌ను ఆరబెట్టడానికి బియ్యం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. అయితే ఫోన్ ఆరబెట్టడానికి బియ్యం ఉపయోగించడం సరైన మార్గమా? దీని గురించి తెలుసుకుందాం.

ఫోన్ మీ చేతిలోంచి జారి నీటిలో పడిపోయిందనుకోండి. లేక బాత్ టబ్ మొదలైన వాటిలో ఫోన్ పడిపోతే ఏం చేస్తారు? తడి ఫోన్‌లను ఆరబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాము. బియ్యం కూడా వీటిలో ఒకటి. ఎందుకంటే బియ్యం తేమను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల తడి ఫోన్‌లను ఆరబెట్టడంలో బియ్యం మంచి పని చేస్తుందని భావిస్తారు.

తడి ఫోన్‌ను ఎలా శుభ్రం చేయాలి?

ఫోన్ తడిగా ఉంటే, దానిని ఆరబెట్టడం ముఖ్యం. మీ ఫోన్ నీటిలో పడితే, దానిని శుభ్రమైన గుడ్డతో శుభ్రం చేయాలి. మొబైల్‌లోని సిమ్‌కార్డును తీసి ఫోన్‌ను నీటితో శుభ్రం చేయాలి. వీలైతే ఫోన్ ఆఫ్ చేసి బ్యాటరీని తీయాలి.

బియ్యంలో పెడితే ఐఫోన్ తడిపోతుందా?

తడి ఐఫోన్‌ను ఎలా ఆరబెట్టాలో ఆపిల్ స్వయంగా చెప్పింది. Apple ప్రకారం.. iPhoneలు ఓపెన్‌ చేసేందుకు వీలుండదు కాబట్టి వాటిని తేలికపాటి ఒత్తిడితో చేతిపై కొట్టాలి. ఐఫోన్ కనెక్టర్ పోర్ట్ క్రిందికి ఉండాలని గుర్తుంచుకోండి. తద్వారా నీరు లేదా ద్రవం ఏదైనా బయటకు రావచ్చు. బియ్యంతో ఎండబెట్టడం విషయానికి వస్తే, ఆపిల్ అలా చేయడానికి నిరాకరిస్తుంది. ఆపిల్ ప్రకారం.. మీ వద్ద ఐఫోన్ ఉంటే దానిని బియ్యంలో పెట్టకూడదు.

Samsung ఫోన్ అయితే ఏమి చేయాలి?

తడి మొబైల్ ఫోన్‌ను ఆరబెట్టడానికి కాటన్ బడ్‌ని ఉపయోగించాలని శాంసంగ్ చెబుతోంది. దీంతో ఫోన్‌లోని ఇయర్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ పోర్ట్‌ను పూర్తిగా శుభ్రం చేయాలి. అదే సమయంలో ఐఫోన్ ఓపెన్ పార్ట్స్ లో కాటన్ పెట్టకూడదని యాపిల్ చెబుతోంది.

మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే, బియ్యం ఆరబెట్టడానికి ఉపయోగించవచ్చు. అయితే, బియ్యం పెద్దవిగా ఉండాలి. ఫోన్ పోర్ట్‌లలోకి ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఫోన్‌ను ఆరబెట్టడంలో సహాయపడుతుంది. పోర్ట్‌లు కూడా సురక్షితంగా ఉంటాయి. మీరు మీ ఫోన్‌ను శుభ్రమైన నీటిలో కాకుండా మురికి నీటిలో పడేసినట్లయితే, శామ్‌సంగ్ ముఖ్యమైన సలహా ఇస్తుంది. మురికి నీటిలో ముంచిన ఫోన్‌ను శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలని, తద్వారా ఫోన్‌లోని మురికి తొలగిపోతుందని కంపెనీ చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఫోన్‌లోని సర్క్యూట్‌లో తుప్పు పట్టడం తదితర సమస్యలు దూరమవుతాయి. ఆపిల్, శాంసంగ్ కంపెనీలు తడి ఫోన్‌లను వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచాలని భావిస్తున్నారు. అయితే గూగుల్ ప్రకారం, తడి ఫోన్‌ను గది ఉష్ణోగ్రతలో మాత్రమే ఉంచాలి.

పొరపాటున కూడా ఇలా చేయకండి

నీటిలో పడిపోయిన ఫోన్‌లో హెయిర్ డ్రైయర్ లేదా కంప్రెస్డ్ ఎయిర్‌ని ఎప్పుడూ ఉపయోగించకూడదు. అంతే కాకుండా ఫ్రీజర్‌లో కూడా ఉంచకూడదు. ఇది ఫోన్‌లో షార్ట్ సర్క్యూట్ సమస్యను కలిగిస్తుంది. అది పని చేయడం ఆగిపోవచ్చు. ఇది కాకుండా, తడి ఫోన్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నించవద్దు లేదా కేబుల్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయవద్దు.

Tags:    

Similar News