Sleep: 24 గంటలు నిద్రపోకుండా ఉండే ఏమవుతోందో తెలిస్తే షాకవుతారు!

ప్రతి ఒక్కరికి నిద్ర ఎంతో అవసరం. ఇది లేకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే

Update: 2023-12-14 03:05 GMT

Telugu Health Tips

ప్రతి ఒక్కరికి నిద్ర ఎంతో అవసరం. ఇది లేకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే బాగా నిద్రపోవాలి. నిద్ర సరిగా లేకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రలేమి సమస్య చాలా మందిలో ఉంటుంది. అందువల్ల ఎల్లప్పుడూ తగినంత నిద్ర అవసరమని వైద్యులు పదేపదే చెబుతుంటారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం..18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పెద్దలు రాత్రికి కనీసం 7 గంటలు నిద్రపోవాలి. ఒక వ్యక్తి ఎంతకాలం నిద్ర లేకుండా జీవించగలడనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, చాలా మంది పని, ఒత్తిడి తదితర కారణాల వల్ల నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు.

చాలా మందిలో 24 గంటల పాటు మెలకువగా ఉన్న తర్వాత దుష్ప్రభావాలు కనిపించడం ప్రారంభిస్తాయి. 24 గంటలు మేల్కొన్న వ్యక్తిలో రక్తంలో BAC స్థాయి 0.10 శాతానికి సమానం. ఇది చిరాకు, ఏకాగ్రత కోల్పోవడం, విపరీతమైన ఒత్తిడి, కండరాల నొప్పి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వంటిది కలిగిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఎవరైనా 48 గంటలు నిరంతరం మేల్కొని ఉంటే, వారు చాలా అలసిపోతారు. వారు కళ్ళు తెరవడానికి కూడా బాధపడుతుంటారు. వారి మెదడు మైక్రోస్లీప్ అని పిలువబడే పూర్తి అపస్మారక స్థితికి వెళ్లడం ప్రారంభమవుతుంది.

నిద్ర లేకుండా 72 గంటల పాటు ఉంటే.. ఆ తర్వాత అలసట లక్షణాలు తీవ్రంగా మారుతాయి. మూడు రోజుల పాటు నిద్ర లేకుండా ఉండటం వల్ల మనిషి మానసిక స్థితి, ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. మూర్ఛ, చిరాకు, ఇతరులతో మాట్లాడలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News