Myocarditis: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మయోకార్డిటిస్ కావచ్చు.. జాగ్రత్త

గుండె కండరాల (మయోకార్డియం) వాపును మయోకార్డిటిస్ అంటారు. అలాగే దీనిని కార్డియోమపతి అని కూడా అంటారు..

Update: 2023-11-28 14:39 GMT

గుండె కండరాల (మయోకార్డియం) వాపును మయోకార్డిటిస్ అంటారు. అలాగే దీనిని కార్డియోమపతి అని కూడా అంటారు. గుండె కండరాలు ఎర్రబడినప్పుడు, శరీరంలోని గుండె సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేయనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే అసాధారణంగా గుండె కొట్టకోవడంతో గుండె కండరాలు వాపు కారణంగా దెబ్బతింటాయి. మయోకార్డిటిస్ వివిధ రకాలుగా ఉంటుంది. ఇది తీవ్రతరమైన దీర్ఘకాలికంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మయోకార్డిటిస్ లక్షణాలు ఏమిటి?

తేలికపాటి సందర్భాల్లో, మయోకార్డిటిస్ ప్రారంభ దశల్లో, రోగి లక్షణాలను అనుభవించకపోవచ్చు. లేదా శ్వాసలోపం, ఛాతీ నొప్పి వంటి తేలికపాటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇది దీర్ఘకాలికంగా ఉండటంతో అత్యంత తీవ్రమైన దశకు చేరుకునే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే చిన్నపాటి లక్షణాలు కనిపించగానే వైద్యున్ని సంప్రదించడం ముఖ్యమంటున్నారు.

☛ ఛాతి నొప్పి

☛ శ్వాస ఆడకపోవుట

☛ గుండె కొట్టుకోవడంలో మార్పులు

☛ అలసట

☛ కాళ్ళు, చీలమండ లేదా పాదాలలో వాపు

☛ తలనొప్పి, శరీర నొప్పి, కీళ్ల నొప్పులు, జ్వరం లేదా గొంతు నొప్పి ఫ్లూ లాంటి లక్షణాలు

మయోకార్డిటిస్‌కు కారణాలు ఏమిటి?

ఇన్ఫెక్షన్, కొన్ని మందులు, రసాయనాలు, లేదా విస్తృతమైన వాపును కలిగించే వ్యాధి అన్నీ మయోకార్డిటిస్‌కు కారణం కావచ్చు. ఇది సహా వివిధ కారణాల వల్ల కూడా సంభవించవచ్చు. మయోకార్డిటిస్ అనేది సాధారణ జలుబు (అడెనోవైరస్), COVID-19, హెపటైటిస్ B, C, పార్వోవైరస్ (పిల్లలలో చిన్నపాటి దద్దుర్లు కలిగిస్తుంది), హెర్పెస్ సింప్లెక్స్ వైరస్‌తో సహా వివిధ రకాల వైరస్‌లకు సంబంధించినది.

సమస్యలు ఏమిటి?

గుండె ఆగిపోవడం : ఈ సమస్య తలెత్తగానే గుండె ఆగిపోవడం, గుండె కండరాలు దెబ్బతినడం జరుగుతుంది. అలాగే కండరాలు ఉబ్బడం జరుగుతుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు సరిపడా రక్తాన్ని సరఫరా చేయకుండా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఈ సమస్య ఉంటే మీకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

దీనిని ఎలా నిర్దారిస్తారు?

రక్త పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఛాతి భాగంలో ఎక్స్‌రే తీస్తారు. అలాగే గుండెకు సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించడం ద్వారా మయోకార్డిటిస్‌ను నిర్ధారిస్తారు. అలాగే ఎంఆర్‌ఐ ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. దీని ద్వారా గుండె కండరాలు దెబ్బతినడానికి గల కారణాలను గుర్తిస్తారు. ఇక ఎండోమియోకార్డియల్‌ బయాప్సీ ద్వారా గుండె కండరాల వాపును తనిఖీ చేస్తారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

అధిక బరువు లేకుండా చూసుకోవాలి. వీటితో హైబీపి, డయాబెటిస్ కంట్రోల్లో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. రోజువారీగా ఎక్సర్‌సైజ్ చేయాలి. తగినంతగా నిద్ర ఎంతో అవసరం. అలాగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి.

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఉండే వ్యాపారవేత్త రాహుల్ జైన్ కుమారుడు గుండె పోటుతో మరణించాడు. అతని వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతున్న విహాన్ జైన్ ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించిన తర్వాత కొంత పరిస్థితి మెరుగుపడింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలసి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు జైన్ కుటుంబం ఢిల్లీ వెళ్లింది. అక్కడ బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే మయోకార్డిటిస్ వైరస్ తోనే గుండె పోటుతో మరణించాడని వైద్యులు చెబుతున్నారు. 

Tags:    

Similar News