శరీరానికి విటమిన్-బి12 ఎందుకు అవసరం.. లోపిస్తే ఏమవుతుంది.. ఏయే ఆహారాల్లో లభ్యం
Vitamin B12: ప్రతి రోజు శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. అవన్ని కూడా సక్రమంగా శరీరానికి అందితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాము..
Vitamin B12: ప్రతి రోజు శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. అవన్ని కూడా సక్రమంగా శరీరానికి అందితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. పోషకాలు లోపించినా.. సరైన ఆహారం అందకపోయినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు లతెత్తుతాయి. శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్-బి12 చాలా కీలకం. ఇది శరీరానికి ఎందుకు ఏవసరమో.. విటమిన్-బి12ను భర్తీ చేసుకోవడానికి ఏ ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్-బి12 అవసరం..
☛ ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ముఖ్యం. జీవితంలో బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముకలకు సంబంధించిన సమస్యలను విటమిన్-బి12 తీసుకోవడం ద్వారా నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్న మాట.
☛ విటమిన్ -బి12 శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే శరీరానికి ఇది చాలా ముఖ్యం.
☛ విటమిన్-బి12 అనేది గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాదు చర్మం, గోర్లు, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది.
☛ విటమిన్ B12 అనేది మనిషి సంతోషంగా ఉండేందుకు, మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనిషి ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. మెదడు పనితీరు వేగవంతం చేస్తుంది.
విటమిన్-బి12 లోపిస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి..?
విటమిన్ బి12 లోపిస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. ఎలాంటి కారణం లేకుండానే అలసటగా అనిపించడం, చర్మం పాలిపోవడం వంటివి జరుగుతుంది. అంతేకాదు తరచుగా తలనొప్పి రావడం, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
విటమిన్-బి12 ఏయే ఆహారాలలో లభిస్తుంది?
☛ విటమిన్ బి12 మాంసం, జంతువుల కాలేయం, మూత్రపిండాలలో విటమిన్-బి12 లభిస్తుంది. అలాగే చేపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ విటమిన్ శరీరానికి పుష్కలంగా లభిస్తుంది.
☛ అలాగే పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవాటిలో విటమిన్-బి12 పుష్కలంగా లభిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.