గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

Pregnancy Tips: గర్భధారణ సమయంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో స్త్రీల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది.

Update: 2024-01-12 13:07 GMT

Pregnancy Tips

Pregnancy Tips: గర్భధారణ సమయంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో స్త్రీల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వారికి అదనపు జాగ్రత్తలు అవసరం. ఈ సమయంలో కొంచెం అజాగ్రత్త చాలా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. గర్భం ప్రారంభమైనప్పటి నుండి మహిళ హార్మోన్లు, శరీరంలో స్థిరమైన మార్పులు సంభవిస్తాయి. అందువల్ల గర్భధారణ సంరక్షణ చిట్కాలను పాటిస్తుండాలి. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో ఎలాంటి అజాగ్రత్త, పొరపాట్లను నివారించడానికి ప్రయత్నించాలి. మొదటి త్రైమాసికంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసుకుందాం..

గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో ఏమి చేయకూడదు

1. భారీ వ్యాయామం చేయవద్దు

గర్భం దాల్చిన మొదటి మూడు నెలల పాటు కఠినమైన వ్యాయామాలు చేయడం మానుకోవాలి. లేదంటే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అబార్షన్ లాంటి పరిస్థితి కూడా రావచ్చు. భారీ వ్యాయామం కాకుండా ఎక్కువ బరువును ఎత్తకూడదు. ఉదాహరణకు వాటర్‌తో ఉన్న బకెట్‌ను ఎత్తకూడదు.

2. ధూమపానం, కెఫిన్ మానుకోండి

కొందరి మహిళల్లో ధూమపానం, మద్యపానం చేసే అలవాటు ఉంటుంది. ఇది అందరిలో లేకపోయినా నగర ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత ధూమపానం, మద్యపానం మానేయాలి. అలాగే టీ, కాఫీలు ఎక్కువగా తాగడం మానేయాలి. ధూమపానం చేసేవారితో పరిచయం కూడా మానుకోవాలి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ స్మోక్‌ తల్లి, బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

3. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి కావద్దు

గర్భిణీ స్త్రీలు తమ మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. హార్మోన్లు, శరీరంలో చాలా మార్పులు జరిగే కాలం ఇది. అటువంటి పరిస్థితిలో మానసిక ఒత్తిడి కూడా చాలా వరకు పెరుగుతుంది. ఇది గర్భధారణ సమయంలో అస్సలు మంచిది కాదు.

గర్భం మొదటి త్రైమాసికంలో ఏమి చేయాలి?

1. గర్భధారణలో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి.

2. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. ఇది తల్లి, బిడ్డను ఎలా చూసుకోవాలో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే ఏదైనా సమస్య నుంచి కోలుకోవడంలో కూడా సహాయపడుతుంది.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News