Chandrababu : నేడు హైదరాబాద్ కు చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు;
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి...
బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకూ భారీ ర్యాలీకి పోలీసులను అనుమతి కోరారు. యాభై కార్లు, 150 ద్విచక్ర వాహనాలతో ర్యాలీకి పోలీసుల అనుమతి ఇచ్చారు. మూడు వందలకు మించి ర్యాలీలో పాల్గొన వద్దని పోలీసులు అనుమతి ఇచ్చిన సమయంలో తెలిపారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ ర్యాలీ టీడీపీ నేతలు ర్యాలీని నిర్వహించనున్నారు.