Allu Arjun : అల్లు అర్జున్ కు మరింత ఊరట.. మరికొన్నిమినహాయింపులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లికోర్టులో మరింత ఊరట లభించింది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లికోర్టులో మరింత ఊరట లభించింది. ఆయన ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొంది. విచారణ నుంచి మినహాయింపులు ఇచ్చింది. అదే సమయంలో అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా నాంపల్లి కోర్టు అనుమతి మంజూరు చేసింది.
మినహాయింపులు ఇస్తూ...
సంథ్యా థియేటర్ తొక్కిసలాటలోమహిళ మరణించిన ఘటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ లభించింది. అయితే ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ ఎదుట హాజరు కావాలని కోరారు. కానీ భద్రత కారణాల దృష్ట్యా అందుకు తన హాజరుకు మినహాయించాలని అల్లుఅర్జున్ కోరగా కోర్టు సమ్మతించింది.