Gold Prices : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ రేట్లు చూసి కొనాల్సిందే
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి.;
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని ఎప్పటి నుంచో హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బంగారం ధరలు తగ్గడం అనేది చాలా తక్కువ సార్లు మాత్రమే జరుగుతుంది. వారంలో ఐదు రోజులు పెరుగుదలే కనిపిస్తుంది. మిగిలిన రెండు రోజుల్లో ఒకరోజు నిలకడగా, మరొక రోజు స్వల్పంగా తగ్గి ఊరట కల్లించేలా ఉంటుంది. అయినా బంగారం, వెండి ధరలు కొనుగోలు విషయంలో మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రధాన కారణం బంగారం విలువ ఎప్పుడూ తగ్గక పోవడమే. దాని ధరలు పెరగడం వల్ల ప్రయోజనం కలుగుతుందని భావించి కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి కోసమే ఎక్కువ మంది బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశముందని చెప్పడంతో మరింత కొనుగోళ్లు పెరుగుతాయని అంటున్నారు.
ఆభరణాల కొనుగోలుకు...
బంగారం అంటే స్టేటస్ సింబల్ గా అందరూ భావిస్తారు. బంగారం ఉంటే గౌరవం పెరుగుతుందని విశ్వాసం నమ్ముతారు. బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశముండటంతో ముందుగానే కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర లక్ష రూపాయలు దాటేసింది. ధరలు తగ్గుతాయేమోనని వెయిట్ చే్స్తే మరింత ధరలు పెరిగితే ఇక అస్సలు కొనుగోలు చేయలేమని భావించి ఇప్పుడే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. దేశంలో బంగారు ఆభరణాలను మాత్రమే ఎక్కువ కొనుగోలు చేయడంతో వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
నేటి ధరలు...
బంగారం అంటే మహిళలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు పురుషులు కూడా అదే తరహాలో కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. పురుషులు ఎక్కువ మంది పెట్టుబడి కోసమే ముందుకు వస్తున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,640 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,01,000 రూపాయలు పలుకుతుంది. ఉదయం ఆరు గంటల వరకూ నమోదయిన ధరలు మాత్రమే. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు కనిపించవచ్చు.