రేపు నీటి సరఫరాలో అంతరాయం
హైదరాబాద్ నగరంలో రేపు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారుల తెలిపారు;
హైదరాబాద్ నగరంలో రేపు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారుల తెలిపారు. హైదరాబాద్ నగరంలో తాగునీరు సరఫరా చేసే మంజీరా ప్రాజెక్టు ఫేజ్ రెండు పరిధిలోని కలబ్‌గూర్ నుంచి హైదర్‌నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు పలు చోట్ల భారీ లీకేజీలు ఏర్పడినందున, వీటిని అరికట్టేందుకు మరమ్మతు పనులు చేపట్టనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి అంటే 14వతేదీ ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. కాబట్టి ఈ 24 గంటలు కింద పేర్కొన్న ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రాంతాలలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే
1. ఓ అండ్ ఎం డివిజన్-6 : ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, బోరబండ.
2. ఓ అండ్ ఎం డివిజన్-9 : కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట్, నిజాంపేట్, హైదర్‌నగర్.
3. ఓ అండ్ ఎం డివిజన్-17 : పటాన్‌చెరు, రామచంద్రాపురం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్, హఫీజ్‌పేట్.
4. ఓ అండ్ ఎం డివిజన్-24 : బీరంగూడ, అమీన్‌పూర్, బొల్లారం పారిశ్రామిక ప్రాంతాలు