Fake Doctors: వామ్మో.. హైదరాబాద్ లోని ఈ ఆసుపత్రులు ఇలా కూడా నడుస్తున్నాయా?

ఇతర తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తాయని;

Update: 2024-07-27 03:05 GMT

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కూకట్‌పల్లి, మియాపూర్‌లోని 40 డెడికేటెడ్‌ స్కిన్‌, లేజర్‌, హెయిర్‌, కాస్మోటాలజీ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న వైద్యులపై తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ (టీజీఎంసీ) వెరిఫికేషన్‌ నిర్వహించి ముగ్గురు నకిలీ వైద్యులను అరెస్టు చేశారు. 20 కేంద్రాలు అర్హత కలిగిన చర్మవ్యాధి నిపుణులు, ప్లాస్టిక్ సర్జన్లు లేదా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నుండి అవసరమైన అనుమతులు లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

కొన్ని కేంద్రాలలో దంత, ఆయుర్వేద, హోమియోపతి చేసిన వారితో కూడా లేజర్‌ చికిత్సలు చేయడానికి ఉపయోగిస్తున్నాయి. అర్హత లేని సో కాల్డ్ స్పెషలిస్ట్ లకు నోటీసులు జారీ చేశారు. ఇటువంటి పద్ధతులు అంటువ్యాధులు, మచ్చలు.. ఇతర తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తాయని నిపుణులు హెచ్చరించారు. "MBBS, MD డెర్మటాలజీ, లేదా MCH ప్లాస్టిక్ సర్జరీ అర్హతలు ఉన్న వైద్యులు మాత్రమే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి సౌందర్య చికిత్సలను నిర్వహించాలి" అని TGMC వైస్-ఛైర్మన్ డాక్టర్ G. శ్రీనివాస్ అన్నారు. తమకు 200కి పైగా ఫిర్యాదులు వచ్చాయని, అక్కడ చూస్తే అంతకంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హత లేని వ్యక్తులు ఈ విధానాలను చేయడం వల్ల ఊహించని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.


Similar News